Share News

Somuveeraju: పేరెంట్ టీచర్ మీటింగ్‌ను గొప్పగా కొనియాడిన సోమువీర్రాజు

ABN , Publish Date - Dec 09 , 2024 | 03:44 PM

Andhrapradesh: సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పేరెంట్స్, స్టూడెంట్‌లతో కలిసి పోయారని బీజేపీ నేత సోమువీర్రాజు అన్నారు. పిల్లలతో కలిసి భోజనాలు చేసి, ఆటలు ఆడుతూ వారిలో ఉత్సాహం నింపారన్నారు. కొంతమంది పిల్లలు గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

Somuveeraju: పేరెంట్ టీచర్ మీటింగ్‌ను గొప్పగా కొనియాడిన సోమువీర్రాజు
BJP Leader Somuveerraju

అమరావతి, డిసెంబర్ 9: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 7న జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌పై బీజేపీ జాతీయ నాయకులు సోము వీర్రాజు (BJP Leader Somuveerraju) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల ఏడున స్కూల్స్‌లో పేరెంట్స్ కమిటీ సమావేశాలు గొప్పగా జరిగాయన్నారు. పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ తరహా పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడూ జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ దేశంలోనే గొప్పగా నిలిచిందని కొనియాడారు.

మంత్రి కుర్చీలో బీజేపీ ఎమ్మెల్యే


రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షలు మంది ఉత్సాహంతో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేలా విద్యాశాఖ అధికారులు జిల్లాల వారీగా మంచి ఏర్పాట్లు చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పేరెంట్స్, స్టూడెంట్‌లతో కలిసి పోయారన్నారు. పిల్లలతో కలిసి భోజనాలు చేసి, ఆటలు ఆడుతూ వారిలో ఉత్సాహం నింపారన్నారు. కొంతమంది పిల్లలు గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

jagana-laddu.jpg


ఈ మీటింగ్‌ల వల్ల అటువంటి పిల్లల గురించి తల్లిదండ్రులకు చెప్పి వారిలో మార్పుకు కృషి చేశారన్నారు. ఇంత గొప్పగా జరిగిన పేరెంట్స్ మీట్‌ను కూటమి ప్రభుత్వం స్టంట్‌గా జగన్ అభివర్ణించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే పేరెంట్స్ కమిటీ సమావేశాలు జరిగాయని జగన్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. ‘‘నాకు తెలిసి ఎక్కడా కూడా ఈ తరహాలో ఇటువంటి పేరెంట్స్ కమిటీ సమావేశాలు జగన్ జమానాలో జరగలేదు’’ అని అన్నారు. పిల్లలకు పెట్టే భోజనాలు నిర్వహణ వంటి అంశాలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

సీఎంకు థ్యాంక్స్ చెప్పిన బొత్స.. ఎందుకో తెలుసా


ప్రతి స్కూల్‌కు కేటాయించే బడ్జెట్ తెలిసేలా పేరెంట్స్ మీట్‌లో అధికారులు వివరించారన్నారు. ఒక పండుగ వాతావరణంలో పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులు, అందరూ పాల్గొని సందడి చేశారన్నారు. ఈ పేరెంట్స్ మీటింగ్ సమావేశాలు దేశంలోనే ఒక గొప్ప అధ్యాయంగా నిలిచాయని కొనియాడారు. ఇంత చక్కటి కార్యక్రమంపై కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీజేపీ నేత సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

Updated Date - Dec 09 , 2024 | 03:44 PM