AP NEWS:ఆ హక్కు వైసీపీకి లేదు.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి విసుర్లు
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:44 PM
జగన్ ప్రభుత్వంలో అందర్నీ మోసం చేశారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
ప్రకాశం : ధర్నాలు చేసే హక్కు వైసీపీ నాయకులకు లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారో కూడా వారికి తెలియదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. రైతులు, పేదల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో అందర్నీ మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో ఉందని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులు కూడా మంచి రిజల్ట్స్ సాధించే విధంగా పని చేస్తున్నామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు: కోవూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి మెగా జాబ్ మేళా ఇవాళ(ఆదివారం) జరిగింది. వీపీఆర్ కన్వీన్షన్ హాల్లో 50 సంస్థల ప్రతినిధులతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు.. ఈ జాబ్ మేళాలో జిల్లాకు చెందిన వేలాదిమంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. మొట్టమొదటి సారి పెట్టిన మెగా జాబ్ మేళా విజయవంతం అయ్యిందని చెప్పారు. పేరుగాంచిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులను తీసుకొచ్చి అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పిస్తున్నామని తెలిపారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా అన్నది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. గతంలో జాబ్ రాని వాళ్లు ఇప్పుడు అవకాశన్ని వినియోగించుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు అవకాశం దక్కని వాళ్లు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్ది తెలిపారు.