Share News

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే

ABN , Publish Date - Mar 27 , 2025 | 07:13 PM

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. భూముల వేలం వేయొద్దని కోరారు. భూములను వేలం వేసే ఆలోచనను రేవంత్ ప్రభుత్వం విరమించుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.

  Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే
Kishan Reddy

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురువారం నాడు లేఖ రాశారు. భవిష్యత్ తరాల అవసరాల కోసం భూముల వేలాన్ని ఆపేయాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఆర్థిక సమస్యల పరిష్కారానికి భూములను వేలం వేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పర్యావరణానికి ఉపయోగపడే భూములను ప్రభుత్వ నిర్వహణ , అప్పుల కోసమో వేలం వేయొద్దని సూచించారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. అందుకోసం ఈ 400 ఎకరాల స్థలం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బంజారాహిల్స్ అంటే హిల్స్ లేకుండా పోయాయని, జూబ్లీహిల్స్ అంటే కొండలు లేకుండా పోయాయని చెప్పారు. గుట్టలను తీసేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు కట్టేశారని కిషన్‌రెడ్డి తెలిపారు.


కోల్ రంగంలో ఎన్నో సంస్కరణలు: కిషన్‌రెడ్డి

12వ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఇటీవలే బిలియన్ టన్ ఉత్పత్తి మైలు రాయిని కోల్ మినిస్ట్రీ చేరుకుందని తెలిపారు. ప్రపంచంలో కోల్ ఉత్పత్తిలో ఇండియా ముందుందని అన్నారు. కోల్ ఉత్పత్తి గ్రోత్ రేట్ పెరిగిందని వివరించారు. కోల్ రంగంలో ఎన్నో సంస్కరణలను మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. దేశంలో కావాల్సిన విద్యుత్ తయారీకి కోల్ ఉత్పత్తి కీలకమని అన్నారు. కోల్ గనుల వేలం పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. 11వ కోల్‌మైన్స్ కమర్షియల్ వేలంలో అత్యధిక ఆదాయం వచ్చిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Revanth Reddy: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..

CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Paper leakage: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

Read Latest Telangana News and Telugu News

Updated Date - Mar 27 , 2025 | 07:16 PM