Quinton de Kock Smart Catch: క్వింటెన్ అద్భుత క్యాచ్.. హెల్మెట్ తీసి మరీ.. చూసి తీరాల్సిన వీడియో
ABN , Publish Date - Mar 27 , 2025 | 07:51 PM
నిన్న కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ క్వింటెన్ డీకాక్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. జనాలు ఈ అద్భుత దృశ్యం చూసి ఉర్రూతలూగిపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: తాజా ఐపీఎల్ సీజన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే పలు మ్యాచుల్లో బ్యాటర్ల బాదుడు చూసి జనాలు మైమరిచిపోయారు. క్రికెట్ అంటే ఇది కదా అంటూ మురిసిపోయారు. ఈ అద్భుత దృశ్యాలు కేవలం బ్యాటర్లకే పరిమితం కాలేదు. ఫీల్డర్లు, బౌలర్లు కూడా మెరుపులు మెరిపించారు. ఈ కోవలోనే దక్షిణాఫ్రికా ప్లేయర్ క్వింటెన్ డీకాక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నిన్నటి కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్వింటెన్ పట్టిన క్యాచ్ జనాలను అబ్బురపరిచింది.
Also Read: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే
32 ఏళ్ల వయసులోనే క్వింటెన్ డీకాక్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కానీ తన దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గలేదని తాజా మ్యాచ్‌లో నిరూపించాడు. వికెట్ కీపర్‌గా తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సమయంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎనిమదో ఓవర్లో వరుణ చక్రవర్తి బౌలింగ్‌లో రియాన్ పరాగ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయాడు. అతడి అంచనా తప్పడంతో బంతి పైకెళ్లింది. అది చూసిన వెంటనే క్వింటెన్ డీకాక్ క్యాచ్‌కు సిద్ధమైపోయాడు. హెల్మెట్ తీసి మరీ జాగ్రత్తగా ముందుకొచ్చి క్యాట్ పట్టాడు. దీంతో, రియాన్ వెనుదిరగాల్సి వచ్చింది. క్యా్చ్‌ను ముందుగానే అంచనా వేయడంతో కేకేఆర్‌కు ఓ వికెట్ దక్కింది.
Also Read: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
ఇక ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ క్వింటెన్ తన సత్తా చాటాడు. 61 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కేకేఆర్ బౌలర్లు అందరూ రాణించడంతో ఆర్ఆర్ 151 పరుగులకే పరిమితమైంది. ఆ తరువాత ఛేదనలో కేకేఆర్ సులువుగా రాజస్థాన్ రాయల్స్‌పై పైచేయి సాధించింది. ఇక జనాలు మాత్రం క్వింటెన్ క్యాచ్ అద్భుతమని కితాబునిస్తున్నారు. రిటైరైనా తనలో ఇంకా జోష్ తగ్గలేదని నిరూపించుకున్నాడంటూ కామెంట్స్ వరద పారిస్తున్నారు. మరి ఈ అద్భుత వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..