Share News

Iftar Party: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 07:11 PM

Iftar Party: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎంచంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన నమాజ్ చేశారు. అలాగే టీడీపీలో హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు.

Iftar Party: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu naidu in Iftar Party

విజయవాడ, మార్చి 27: తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మైనార్టీలకు అండగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం విజయవాడలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదలతో తానుండాలనేదే తన జీవితాశమయని ఆయన పేర్కొన్నారు. నూటికి నూరు శాతం పేదల్నిపైకి తీసుకొచ్చేందుకే పీ4ను మార్చి 30వ తేదీ నుంచి చేపడుతున్నామని ఆయన వివరించారు.


పేదరికంలో ఉన్న ప్రతీ ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగాపైకి తీసుకొస్తామన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తులని కాపాడతామని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మత సామరస్యాన్ని కాపాడుతూ.. ముస్లిం మైనార్టీలను అన్ని విధాలాపైకి తీసుకొస్తామని తెలిపారు. ముస్లిం మైనార్టీలతో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకొన్నారు. సమైఖ్య ఆంధ్రలోనైనా.. నవ్యాంధ్రలోనైనా ముస్లింలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. ఉర్థూని రెండో భాషగా గుర్తించటంతో పాటు వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడుతూ వచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.


అలాగే హైదరాబాద్, కర్నూల్‌లో ఉర్ధూ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చామన్నారు. ఇక హైదరాబాద్, కర్నూల్, విజయవాడల్లో హజ్ హౌస్ నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. రంజాన్ పండగ సందర్భంగా తోఫా ఇవ్వటంతో పాటు ఇమామ్‌లు, మౌజమ్‌లను ఆదుకుంది తెలుగుదేశం పార్టీనేనని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో గతంలో కంటే ఈ సారి రూ. 1,300 కోట్లు అదనంగా మైనార్టీలకు కేటాయించామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతీ పేదవాడినిపైకి తీసుకొచ్చే కార్యక్రమమే పీ4 అని ఆయన అభివర్ణించారు.


రంజాన్ మాసంలో ఈ రోజు మీ అందరికి కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా అందరికి సీఎం చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గత 40 ఏళ్లుగా తాను సైతం రంజాన్ మాసంలో భాగస్వామ్యం అవుతున్నానన్నారు. క్రమ శిక్షణ, దాతృత్వంతోపాటు ధార్మికచింతన కూడికే రంజాన్ మాసమని ఆయన పేర్కొన్నారు.

ఉదయం నుంచి ఖురాన్ చదవడం.. ఇతరలుకు సహాయం చేయడం వంటి మంచి పనులు చేస్తున్నారంటూ ముస్లిం సోదరులపై ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. పాజిటీవ్ ఆలోచనలతో.. అందరూ బాగుండాలని పని చేస్తున్నారని తెలిపారు. ఖురాన్ నేర్పించిన మంచి గుణం.. డబ్బులున్నవాళ్లు పేదలకు సాయం చేయడమన్నారు. ఈ ఇఫ్తార్ విందులో మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎండీ ఫరూక్‌ పాల్గొన్నారు. అంతకుముందు ముస్లిం సోదరులతో కలిసి సీఎం చంద్రబాబు నమాజ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై

Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..

Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి

Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్

LRS : ఎల్ఎస్ఆర్‌ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..

ఈ పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..?

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 07:14 PM