Anganvadi: అంగన్‌వాడీలు మడత కాజా తీనిపిస్తే ఎలా ఉంటుందో సీఎంకి చూపిస్తాం
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:42 PM
కళ్లు తిరిగి కిందపడిన అంగన్‌వాడీని పోలీసులు ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం రేపుతోంది. మాట ఇచ్చి మడమ తిప్పిన సీఎం డౌన్ డౌన్ అంటూ అంగన్ వాడీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.
అమరావతి: కళ్లు తిరిగి కిందపడిన అంగన్‌వాడీని పోలీసులు ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం రేపుతోంది. మాట ఇచ్చి మడమ తిప్పిన సీఎం డౌన్ డౌన్ అంటూ అంగన్ వాడీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి ఏం చేద్దామనుకుంటున్నారని మండిపడుతున్నారు. అంగన్ వాడీలు మడత కాజా తీనిపిస్తే ఎలా ఉంటుందో సీఎంకి చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. మహిళంటారు.. ముద్దులు పెడతారు.. ఆపై పోలీసులతో కొట్టిస్తారని ఓ అంగన్‌వాడీ కార్యకర్త మండిపడింది.
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు (బుధవారం) కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్ వాడి వర్కర్స్ పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.