Share News

సీఎంతో సునీతారెడ్డి దంపతుల భేటీ

ABN , Publish Date - Sep 18 , 2024 | 05:03 AM

దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి దంపతులు మంగళవారమిక్కడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

సీఎంతో సునీతారెడ్డి దంపతుల భేటీ

వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదులో

నిజానిజాలు తేల్చాలని వినతి

సానుకూలంగా స్పందించిన చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి దంపతులు మంగళవారమిక్కడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌తోపాటు తమపై పోలీసులు పెట్టిన అక్రమ కేసు గురించి ఆయన దృష్టికి తెచ్చారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, రాంసింగ్‌పై కేసు తదితర అంశాలపై సీఐడీ విచారణ జరిపించాలని కోరారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలూ తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం అందించారు. ఇదే సందర్భంలో అక్టోబరు 3-5 తేదీల్లో అంటువ్యాధుల నివారణ-నియంత్రణపై హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో జరిగే జి-స్పార్క్‌-2024 (గ్లోబల్‌ సౌత్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ అండ్‌ యాంటీమైక్రోబియల్‌ స్టివార్డ్‌షిప్‌) సదస్సుకు రావలసిందిగా సునీత ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

Updated Date - Sep 18 , 2024 | 07:34 AM