Share News

AP News: ఏపీలో తెలంగాణ పోలీసుల కాల్పులు.. అసలేమైందంటే..

ABN , Publish Date - Oct 20 , 2024 | 04:50 PM

బత్తపల్లి మండలం రామాపురంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. తెలంగాణకు చెందిన పోలీసులు.. అక్కడ కాల్పులు జరిపారు. మరి తెలంగాణ పోలీసులు అక్కడ ఎందుకు కాల్పులు జరిపారు? ఎవరిపై ఈ కాల్పులు జరిపారు? అసలు మ్యాటరేంటి? పూర్తి వివరాలివే..

AP News: ఏపీలో తెలంగాణ పోలీసుల కాల్పులు.. అసలేమైందంటే..
Telangana Police

శ్రీ సత్యసాయి జిల్లా: బత్తలపల్లి మండలం రామాపురంలో ఒక్క సరిగా కాల్పుల కలకలం రేగింది. బీహార్‌కు చెందిన దొంగల ముఠాపై తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపారు. దాదాపు మూడు రౌండ్లకు పైగా ఈ కాల్పులు జరిపారు. తెలంగాణలో దొంగతనాలకు పాల్పడిన బీహార్ దొంగల ముఠా ఏపీలోని బత్తలపల్లి మండలం రామపురంలో షెల్టర్ తీసుకున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ పోలీసులు శనివారం రాత్రి బత్తలపల్లికి చేరుకున్నారు. బత్తలపల్లి సమీపంలో ఉన్న రామాపురం బస్టాండ్ వద్ద మకాం వేశారు.


ఆదివారం కావడంతో సమీపంలో ఉన్న చికెన్ మటన్ షాపుల్లో ధరలు ఎలా ఉన్నాయంటూ షాపుల వాళ్లతో కూర్చుని మాట్లాడారు. ఇదే సందర్భంలో బీహార్ దొంగల ముఠా ద్విచక్ర వాహనాల్లో బయటికి రావడంతో అక్కడే కాపు కాచి ఉన్న తెలంగాణ పోలీసులు ఒక్క సారిగా బీహార్ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ దొంగల ముఠా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆ దొంగలపై కాల్పులు చేశారు. దాదాపు మూడు రౌండ్లు కాల్పులు చేశారు.


అయినప్పటికీ బీహార్ దొంగల ముఠా తెలంగాణ పోలీసులకు చిక్కలేదు. వారిని తప్పించుకుని పరారయ్యారు. బీహార్ దొంగల ముఠాలో ఒకరు కదిరి వైపు వెళ్ళుగా.. మరొకరు తాడిమర్ వైపు వెళ్లారు. దీంతో తెలంగాణ పోలీసులు టీమ్‌లుగా విడిపోయి వారిని ఛేజ్ చేశారు. ఈ షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా రామాపురం సర్కిల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీహార్ దొంగల ముఠా రామాపురంలో ఉండడంతో వారికి ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయంపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. రామాపురం చేరుకున్న ధర్మారం డిఎస్పీతో పాటు స్థానిక పోలీసులు.. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.


Also Read:

నిర్ఘాంతపరిచే ఘటన.. త్రిశూలంతో నాన్నమ్మను పొడిచి చంపి ఆమె రక్తాన్ని..

బద్వేల్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

పేలుడు ప్రాంతంలో కీలకమైన క్లూలు

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 20 , 2024 | 04:50 PM