Share News

Weather Update: రాగల 24 గంటల్లో వాతావరణంపై విశాఖ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:30 PM

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో వరద విలయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాపై వర్షాలు పంజా విసిరాయి. విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. అయితే మునుపెన్నడూ ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వం ముమ్మరంగా సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

Weather Update: రాగల 24 గంటల్లో వాతావరణంపై విశాఖ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన
Rain Updates

విశాఖపట్నం: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో వరద విలయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాపై వర్షాలు పంజా విసిరాయి. విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. అయితే మునుపెన్నడూ ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వం ముమ్మరంగా సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తన సమర్థవంతమైన పనితీరును మరోసారి చాటిచెప్పుకుంటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పడితే సహాయక కార్యక్రమాలను మరింత వేగిరం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం రాగాల 24 గంటల్లోని వాతావరణంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది.


రాగల 24 గంటలలో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలలో, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక విదర్భ, తెలంగాణ ప్రాంతాలలో వాయుగుండం కొనసాగుతోందని తెలిపింది. రామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.


ఇక గడిచిన 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరుకులో అత్యధికంగా 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 55 కిలోమీటర్లు వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఈరోజు (సోమవారం) మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


ఈ రోజు, రేపు రైళ్లు రద్దు..

భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల రైలు పట్టాలపై నీళ్లు నిలిచాయి. దీంతో ఈ రోజు (సోమవారం), రేపు (మంగళవారం) విశాఖపట్నం మీదగా నడిచే పలు రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. సోమవారం (2న) విశాఖ మీదుగా నడిచే విశాఖ-సికింద్రాబాద్ - విశాఖ (గోదావరి ఎక్స్‌ప్రెస్) రద్దు అయ్యింది. ఇక

విశాఖ - న్యూఢిల్లీ (ఏపీ ఎక్స్‌ప్రెస్), చెన్నై సెంట్రల్ - పూరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి విశాఖకు వచ్చే దురంతో ఎక్స్‌ప్రెస్, తిరుమల నుంచి విశాఖకు వచ్చే తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దు అయ్యాయి. ఇక 3వ తారీఖున (మంగళవారం) కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. 3,4 తేదీల్లో సికింద్రాబాద్ - షాలిమార్- సికింద్రాబాద్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు అయ్యాయి. 20707 - 20708 సికింద్రాబాద్ - విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు రద్దు అయ్యాయి. 207833 - 207834 విశాఖ - సికింద్రాబాద్- విశాఖ (వందే భారత్ ఎక్స్‌ప్రెస్) రైళ్ల రాకపోకలు కూడా రద్దు అయ్యాయి.

Updated Date - Sep 02 , 2024 | 04:38 PM