Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి భేటీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:32 AM
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ భేటీలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏఐ, మెడ్‌టెక్ ఏ విధంగా దోహదపడుతున్నాయనే అంశాలపై చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులపై చర్చ
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ భేటీలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏఐ, మెడ్‌టెక్ ఏ విధంగా దోహదపడుతున్నాయనే అంశాలపై చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఏఐ, మెడ్‌టెక్ అలయన్స్ ఫౌండేషన్‌తో కలసి ఆరోగ్యరంగంలో మరింత మెరుగైన మార్పులకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో ఏఐజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కలపాల పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే