Polavaram project: 2026కి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి: పాటిల్
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:36 AM
శుక్రవారం లోక్‌సభలో జలశక్తిశాఖ గ్రాంట్ల డిమాండ్లకు సంబంధించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వాలు చేసింది శూన్యమని అన్నారు. ‘2015లో రూ.15 వేల కోట్లకు పైగా ప్రధాని మోదీ పోలవరానికి ఇచ్చి పనులు ప్రారంభించారు.

న్యూఢిల్లీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘పోలవరం సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న అంశం. ప్రధాని మోదీ వచ్చాక ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో జలశక్తిశాఖ గ్రాంట్ల డిమాండ్లకు సంబంధించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వాలు చేసింది శూన్యమని అన్నారు. ‘2015లో రూ.15 వేల కోట్లకు పైగా ప్రధాని మోదీ పోలవరానికి ఇచ్చి పనులు ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.12 వేల కోట్లకు పైగా నిధులు కేయించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తియితే 2.91 లక్షల హెక్టార్ల పంట సాగవుతుంది. అలాగే విశాఖపట్నానికి తాగు నీరు, పరిశ్రమలకు నీళ్లు లభిస్తాయి. 540 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 28.5 లక్షల మంది ప్రజలకు లాభం జరగనుంది. నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు సమకూర్చుతుంది’ అని మంత్రి పాటిల్ వివరించారు.
17.7% తగ్గిన టీబీ కేసులు: నడ్డా
‘దేశంలో క్షయ కేసులు 2015 నుంచి 17.7ు తగ్గాయి. మరణాల సంఖ్య 21.4ు తగ్గింది’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ టీబీ నివేదిక-2024 ప్రకారం ఈ తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 2025 నాటికి సంపూర్ణ టీబీ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోదని నడ్డా స్పష్టం చేశారు.
ఎల్‌ఐసీ ఏజెంట్లకు భరోసా కల్పించాలి: పుట్టా మహేశ్
‘ఎల్‌ఐసీ ఏజెంట్ల భద్రత, బీమా రంగ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే కమీషన్ మార్పులను రద్దు చేయాలి. ఏజెంట్ల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించాలి’ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు శుక్రవారం నివేదిక సమర్పించారు. ‘ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న 14.4 లక్షల మంది ఏజెంట్లు రూ.44.31 లక్షల కోట్ల లైఫ్ ఫండ్, రూ.52.85 లక్షల కోట్ల జీవిత బీమా సంస్థ ఆస్తులకు విశేషంగా సహకరిస్తున్నారు’ అని ఎంపీ వివరించారు.
మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయండి: దగ్గుమళ్ల
ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘మామిడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలి. ఇతర దేశాలకు ఎగుమతి చేేస మామిడి గుజ్జుపై సుంకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. విదేశాలకు మామిడి గుజ్జును ఎగుమతి చేసే అవకాశాన్ని కల్పించాలి. ఏపీలో 3.7 లక్షల హెక్టార్లలో మామిడి పంట విస్తరించింది. కృష్ణా, చిత్తూరు, గోదావరి జిల్లాలు మామిడి పంటకు ప్రసిద్థిగాంచినవి. ముఖ్యంగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తోతాపురి ప్రధాన పంట. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే గుజ్జు ఉక్రెయిన్‌కు ఎగుమతి అయ్యేది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గుజ్జు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎగుమతి అవకాశాలను పెంచేలా చర్యలు తీసుకోవాలి’ అని ఎంపీ కోరారు. మామిడికి గిట్టుబాటు ధరను కల్పించి అన్నదాతలకు అండగా నిలవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు దగ్గుమళ్ల విజ్ఞప్తి చేశారు.
టీఓఆర్ పునఃసమీక్ష అంటే ఏపీకి అన్యాయమే: పురందేశ్వరి
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీఓఆర్)ను పునఃసమీక్షించి, నీటి పంపకాల విషయంలో వెనక్కు వెళ్లడమంటే ఏపీకి అన్యాయం చేసినట్లే అని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఆమె మాట్లాడారు. ‘కేంద్రం టీఓఆర్ పునఃసమీక్ష విషయంలో జోక్యం చేసుకోవాలి. కృష్ణాజలాల పంపిణీకి, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర మధ్య జల వివాదాల పరిష్కారానికి 1969లో బచావత్ ట్రైబ్యునల్ ఏర్పాటయింది. ఏపీకి 811 టీఎంసీలు కేటాయించగా, విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. కమాండ్ ఏరియాతో పాటు వినియోగ యంత్రాంగాల ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి’ అని పురందేశ్వరి వివరించారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే