బ్లూ స్టార్ నుంచి సరికొత్త శ్రేణి డీప్ ఫ్రీజర్లు
ABN , Publish Date - Apr 05 , 2024 | 02:24 AM
బ్లూ స్టార్ లిమిటెడ్ మార్కెట్లోకి సరికొత్త శ్రేణి డీప్ ఫ్రీజర్లను విడుదల చేసింది. వివిధ రంగాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 60 నుంచి 600 లీటర్ల సామర్థ్యంతో ఈ డీప్ ఫ్రీజర్లను...
హైదరాబాద్: బ్లూ స్టార్ లిమిటెడ్ మార్కెట్లోకి సరికొత్త శ్రేణి డీప్ ఫ్రీజర్లను విడుదల చేసింది. వివిధ రంగాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 60 నుంచి 600 లీటర్ల సామర్థ్యంతో ఈ డీప్ ఫ్రీజర్లను తీసుకువచ్చినట్లు గురువారం నాడిక్కడ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బీ త్యాగరాజన్ వెల్లడించారు. డెయిరీ, ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ ఫుడ్, రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ సహా ఇతర విభాగాల్లోని కస్టమర్ల అవసరాలను ఈ డీప్ ఫ్రీజర్లు తీరుస్తాయని తెలిపారు. ఈ డీప్ ఫ్రీజర్ల ధర రూ.16,000 నుంచి ప్రారంభమవుతాయన్నారు. మహారాష్ట్రలోని వాడాలో రూ.480 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ఈ డీప్ ఫ్రీజర్లను ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ రిఫ్రిజిరేషన్ బిజినెస్) ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రూ.350 కోట్లతో శ్రీసిటీ ప్లాంట్ విస్తరణ
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్లాంట్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లతో విస్తరించనున్నుట్లు ఎండీ త్యాగరాజన్ వెల్లడించారు. శ్రీసిటీ ప్లాంట్‌లో కంపెనీ రూమ్ ఏసీలను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల యూనిట్లుగా ఉండగా తాజాగా చేపట్టనున్న విస్తరణతో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 6 లక్షల యూనిట్లకు చేరుతుందని తెలిపారు.