బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
ABN , Publish Date - Sep 17 , 2024 | 04:11 AM
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్‌కు అపూర్వ స్పందన లభించింది. ఐపీఓ ధర రూ.70తో పోలిస్తే, రెట్టింపునకు పైగా లాభంతో లిస్టయింది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు 114.28 శాతం ప్రీమియంతో రూ.150 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది...
తొలిరోజే షేరు 136ు వృద్ధితో అప్పర్ సర్క్యూట్‌కు చేరిక
రూ.1.37 లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ
ఇన్వెస్టర్లకు ఒక లాట్‌పై రూ.20,330 లాభం
ముంబై: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్‌కు అపూర్వ స్పందన లభించింది. ఐపీఓ ధర రూ.70తో పోలిస్తే, రెట్టింపునకు పైగా లాభంతో లిస్టయింది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు 114.28 శాతం ప్రీమియంతో రూ.150 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 135.7 శాతం ఎగబాకి అప్పర్ సర్క్యూట్ రూ.164.99 వద్ద స్థిరపడింది. తొలిరోజు ట్రేడింగ్ ముగిసేసరికి, కంపెనీ మార్కెట్ సంపద రూ.1,37,406.09 కోట్లకు చేరుకుంది. బీఎ్‌సఈలో 608.99 లక్షల కంపెనీ షేర్లు ట్రేడయ్యాయి. ఈ నెల 11తో ముగిసిన రూ.6,560 కోట్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మెగా ఐపీఓకు సైతం ఏకంగా 63.60 రెట్ల బిడ్లు లభించాయి.
ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో షేర్లు లభించిన ఇన్వెస్టర్లకు మొదటి రోజే లాభాల పంటపడింది. ఈ ఇష్యూలో ఒక లాట్ ద్వారా 214 షేర్లు ఆఫర్ చేశారు. షేరు ధర రూ.70 ప్రకారం లాట్ (214) షేర్ల కొనుగోలు విలువ రూ.14,980. ఆ రకంగా ఈ ఇష్యూలో ఒక లాట్ షేర్లు లభించిన ఇన్వెస్టర్ పెట్టుబడి విలువ తొలిరోజే రూ.20,330 లాభంతో మొత్తం రూ.35,310కి చేరుకుంది.
నం.1 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరణ
స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌తో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.1.37 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో దేశంలో అత్యంత విలువైన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (హడ్కో) రూ.49,477 కోట్ల మార్కెట్ క్యాప్‌తో రెండో స్థానంలో ఉండగా.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (రూ.37,434 కోట్లు), పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ (రూ.27,581 కోట్లు), ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ.20,045 కోట్లు), ఆప్టస్ వేల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా (రూ.16,598 కోట్లు), ఆవాస్ ఫైనాన్షియర్స్ (రూ.14,278 కోట్లు), కెన్‌ఫిన్ హోమ్స్ (రూ.11,983 కోట్లు), సమ్మాన్ క్యాపిటల్ (రూ.11,773 కోట్లు), హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా(రూ.10,602 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
క్రాస్ లిమిటెడ్ లిస్టింగ్ ఓకే
వాహన విడిభాగాల తయారీ సంస్థ క్రాస్ లిమిటెడ్ సైతం సోమవారం షేర్లను మార్కెట్లో లిస్ట్ చేసింది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.240 వద్దనే లిస్ట్ అయినప్పటికీ, తొలిరోజు ట్రేడింగ్ నిలిచేసరికి 8.13 శాతం లాభంతో రూ.259.50 వద్ద ముగిసింది.