Share News

హైదరాబాద్‌ సీఓఈలో ఐసీఏఐ రీసెర్చ్‌ హబ్‌

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:32 AM

చార్టర్డ్‌ అకౌంటెంట్ల అత్యున్నత స్థాయి సంస్థ ఐసీఏఐ హైదరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో (సీఓఈ) అత్యాధునిక పరిశోధనా హబ్‌ను ఏర్పాటు చేసింది...

హైదరాబాద్‌ సీఓఈలో ఐసీఏఐ రీసెర్చ్‌ హబ్‌

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చార్టర్డ్‌ అకౌంటెంట్ల అత్యున్నత స్థాయి సంస్థ ఐసీఏఐ హైదరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో (సీఓఈ) అత్యాధునిక పరిశోధనా హబ్‌ను ఏర్పాటు చేసింది. సీఓఈకి కొత్త డీన్‌, డైరెక్టర్‌గా నుపుర్‌ పవన్‌ బంగ్‌ను నియమించింది. కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లు, ఆర్థిక అక్షరాస్యత, విధానాల రూపకల్పనలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్ర, వ్యాపార సౌలభ్యంతో కూడిన సత్పరిపాలన వంటి భిన్న అంశాలపై ఈ కేంద్ర లోతైన అధ్యయనం చేపడుతుందని ఐసీఏఐ ప్రెసిడెంట్‌ రంజిత్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు.


ప్రస్తుతం ఐసీఏఐకి హైదరాబాద్‌, జైపూర్‌లలో రెండు సీఓఈలు పని చేస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో కోల్‌కతాలో మూడో సీఓఈని ప్రారంభించనున్నారు. పరిశోధన, ఇన్నోవేషన్‌, నైపుణ్యాల నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు మూడేళ్లలో దేశవ్యాప్తంగా మరో ఎనిమిది సీఓఈలను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఐసీఏఐకి ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 9.85 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 05:32 AM