Onion Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు, కారణమిదే
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:37 PM
దేశంలో పెరిగిన ఉల్లి ధరలను(onion prices) నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం(central Government) కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్(buffer stock) కోసం ప్రభుత్వం దాదాపు 71 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది.
దేశంలో పెరిగిన ఉల్లి ధరలను(onion prices) నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం(central Government) కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్(buffer stock) కోసం ప్రభుత్వం దాదాపు 71 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లి ధర రిటైల్ మార్కెట్లో రూ.40 దాటిన నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం రానున్న కాలంలో ఉల్లి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
5 లక్షల టన్నుల ఉల్లి కొనుగోలుకు సన్నాహాలు
ధరలు(prices) నిలకడగా ఉండేందుకు ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని(onion) కొనుగోలు(puchase) చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు సానుకూలంగా ఉంటడంతో రిటైల్ ధరలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 20 వరకు కేంద్ర ప్రభుత్వం 70,987 టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్‌గా కొనుగోలు చేసిందని వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి తెలిపారు. గతేడాది ఇదే సమయంలో 74,071 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశారు.
వేడి, తక్కువ వర్షం కారణంగా
ఈ ఏడాది ఎండ తీవ్రత, వర్షాలు(rains) తక్కువగా ఉండడంతో రబీలో దాదాపు 20 శాతం మేర దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఉల్లి ధరలు(onion rates) పెరగడానికి ఇవి కూడా ఓ కారణమని భావిస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది బఫర్ ఉల్లి కొనుగోళ్ల వేగం పెరగనుందని అధికారులు అంటున్నారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ బఫర్ స్టాక్‌ను ఉపయోగించనుంది.
ఎగుమతులపై నిషేధం
ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి నిరంతర చర్యలు తీసుకుంటోంది. గతంలో 40 శాతం ఎగుమతి సుంకం విధించారు. అలాగే డిసెంబర్ 8, 2023న ఎగుమతి నిషేధించబడింది. ఈ చర్యలు దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వానికి దోహదపడ్డాయి. 40 శాతం ఎగుమతి సుంకం మే 4, 2024న నిషేధం ఎత్తివేయబడింది.
ఈ ఏడాది వేడిగాలులు, ఉక్కపోత కారణంగా పచ్చికూరగాయల ఉత్పత్తి తగ్గింది. దీంతో టమోటా, బంగాళదుంప, ఉల్లి తదితర కూరగాయల ధరలు పెరిగాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి దాదాపు 254.73 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. గతేడాది 302.08 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి జరిగింది. ఈసారి ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
Next Week IPOs: ఐపీఓల వారం మళ్లీ వచ్చేసింది.. నెక్ట్స్ వీక్ ఏకంగా 10..
Gold and Silver Rates Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..
For Latest News and Business News click here