Share News

BSNL: మరో అద్భుతమైన ప్లాన్‌ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:46 PM

ఇటీవల Jio, Airtel, Vi వంటి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. దీంతో యూజర్లు రీఛార్జ్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఈ కంపెనీలకు పోటీగా BSNL రంగంలోకి దిగి మరో చౌక 90 రోజుల ప్లాన్‌ను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

BSNL: మరో అద్భుతమైన ప్లాన్‌ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..
bsnl new plans

భారతీయ టెలికాం రంగంలో ప్రధాన పోటీదారులుగా జియో, ఎయిర్‌టెల్, వీఐ అనే మూడు కంపెనీలు మత్రమే ఉన్నాయి. అయితే గత కొన్ని నెలలుగా ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL ప్రైవేట్ కంపెనీలకు నిద్రలేకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీలకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ల ధరలను ప్రకటిస్తోంది. దీంతో అనేక మంది యూజర్లు ఈ సంస్థ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ కంపెనీల కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుంటే, బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. దీంతో BSNL చౌక రీఛార్జ్ ప్లాన్‌లతో Jio, Airtel, Vi సంస్థలకు టెన్షన్‌ పెరుగుతోంది.


ఆకట్టుకుంటున్న ప్రభుత్వ సంస్థ

బీఎస్‌ఎన్‌ఎల్ ఒకదాని తర్వాత ఒకటి కొత్త ప్లాన్‌లను తీసుకువస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. మీరు తక్కువ ధరలో దీర్ఘకాల వ్యాలిడిటీతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే BSNL తాజాగా 90 రోజుల వాలిడిటీ ప్లాన్‌ను ప్రకటించింది. దీనిలో మీరు కేవలం 201 రూపాయలకే దాదాపు మూడు నెలల వాలిడిటీని పొందుతారు. ధరల పెంపు తర్వాత ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో ఇబ్బంది పడిన వారికి ప్రభుత్వ టెలికాం సంస్థ పెద్ద బహుమతిని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. మీరు ఎక్కువగా ఇంటర్నెట్‌ని ఉపయోగించకపోతే, ఇది మీకు ఉత్తమమైన ప్లాన్ అవుతుందని చెప్పవచ్చు.


ఫ్రీ కాలింగ్ సౌకర్యంతోపాటు

BSNL రూ. 201 ప్లాన్ ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడితే మీరు కాల్ చేయడానికి 300 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. మీరు ఏ నెట్‌వర్క్‌కైనా ఈ ఉచిత కాలింగ్ నిమిషాలను ఉపయోగించుకోవచ్చు. ఇందులో లభించే డేటా ప్రయోజనాల గురించి మాట్లాడితే, మీకు మొత్తం 6GB డేటా అందించబడుతుంది. BSNL ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 99 ఉచిత SMSలను కూడా అందిస్తుంది. ప్రైవేటు సంస్థల రీఛార్జ్ ధరలతో పోలిస్తే ఈ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో అనేక మంది క్రమంగా BSNLకు మారుతున్నారు.


BSNL రూ. 499 ప్లాన్

మీకు మరింత డేటా, కాలింగ్ అవసరమైతే BSNL రూ. 499 ప్లాన్ ఎంచుకోవడం బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో కాల్స్‌తోపాటు డేటా సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 90 రోజులు. ఇందులో మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంటే మీరు ఏ నెట్‌వర్క్‌లో ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు 300 ఉచిత SMSలు, డేటా సౌకర్యాన్ని కూడా పొందుతారు. మరికొంత డేటాను వినియోగించుకుని తక్కువ డబ్బు ఖర్చు చేయాలనుకునే వారు ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 28 , 2024 | 01:49 PM