Gold Rates: ఒక్క రోజులోనే పెరిగిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతంటే..
ABN , Publish Date - Dec 18 , 2024 | 07:30 AM
Gold Rates: మూడ్నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం.. మహిళలకు మరోసారి షాక్ ఇచ్చింది. ఒక్క రోజులోనే గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగాయి. ఇప్పుడు తులం పసిడి ఎంత ఉందంటే..
Today Gold Rates: మూడ్నాలుగు రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పడిపోతూ వచ్చాయి. రెండ్రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.4 వేల మేర తగ్గడంతో మహిళలు సహా పసిడి ప్రియులంతా పండుగ చేసుకున్నారు. ధర భారీగా దిగిరావడంతో బంగారం కొనేందుకు ఎగబడ్డారు. అయితే వాళ్ల ఆనందం గంటల్లోనే ఆవిరైంది. మళ్లీ పసిడి జోరందుకుంది. రయ్‌రయ్‌మంటూ రూ.80 వేల మార్క్‌ను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఒక్క రోజులోనే బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి? తులం బంగారం ఎంత? అనేది ఇప్పుడు చూద్దాం..
సిల్వర్ రివర్స్
గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. డిసెంబర్ 18న పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. బుధవారం నాడు బంగారం ధర రూ.120 వరకు పెరిగింది. ఇవాళ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,510గా నమోదైంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.78,010 పలుకుతోంది. ఒకవైపు బంగారం ధరలు పెరగడం మొదలవగా.. వెండి ధరలు మాత్రం తగ్గడం గమనార్హం. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేట్ రూ.99,900 పలుకుతోంది. ఇవి బుధవారం ఉదయం నమోదైన ధరలు. రేట్లు ఒక్కోసారి మధ్యాహ్నానికే మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనే ముందు స్థానికంగా ధరలు తెలుసుకోవాలి.
Also Read:
కార్ల తయారీలో మారుతి రికార్డు
పెన్నా, సంఘీ.. అంబుజాలో విలీనం
శ్రీసిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్
For More Business And Telugu News