మార్కెట్లో ఐక్యూ జడ్9ఎక్స్ స్మార్ట్‌ఫోన్
ABN , Publish Date - May 24 , 2024 | 03:09 AM
తెలుగు రాష్ర్టాల మార్కెట్లో ఐక్యూ జడ్9ఎక్స్ స్మార్ట్‌ఫోన్లను గురువారం విడుదల చేశారు. అత్యుత్తమ ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ల ధర వేరియెంట్‌ను బట్టి రూ.11,999 నుంచి రూ.15,999 మధ్యన ఉంది...

హైదరాబాద్: తెలుగు రాష్ర్టాల మార్కెట్లో ఐక్యూ జడ్9ఎక్స్ స్మార్ట్‌ఫోన్లను గురువారం విడుదల చేశారు. అత్యుత్తమ ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ల ధర వేరియెంట్‌ను బట్టి రూ.11,999 నుంచి రూ.15,999 మధ్యన ఉంది. 7.99 ఎంఎం మందంతో అతి సన్నగా కనిపించే ఈ హ్యాండ్‌సెట్లకు 6000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఎంటర్‌టైన్‌మెంట్, అడ్వెంబర్ ఔత్సాహికులకు ఇది చక్కని స్మార్ట్‌ఫోన్ అని ఐక్యూ సీఈఓ నిపుణ్ మార్యా అన్నారు. అమెజాన్‌లోని ఐక్యూ ఇ-స్టోర్‌లో ఈ హ్యాండ్‌సెట్లు రెండు కలర్ వేరియెంట్లలో అందుబాటులో ఉంటాయి.