Share News

Mukesh Ambani: ఆ దేశం అప్పులను తీర్చేందుకు ముఖేష్ అంబానీ బిగ్ ప్లాన్.. ఎలాగంటే..

ABN , Publish Date - Nov 02 , 2024 | 09:46 AM

ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. ఏకంగా ఓ దేశ ఆర్థిక వ్యవస్థను అప్పుల బారం నుంచి బయటపడేయడానికి ఆయన ఓ ప్రణాళిక రూపొందించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Mukesh Ambani: ఆ దేశం అప్పులను తీర్చేందుకు ముఖేష్ అంబానీ బిగ్ ప్లాన్.. ఎలాగంటే..
Mukesh Ambani

భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించిన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), ఇప్పుడు ఆఫ్రికాలో కూడా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఓ ఆఫ్రికా దేశానికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల బారి నుంచి బయటపడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎలాగంటే ముఖేష్ అంబానీ ఇక్కడ బ్యాంకింగ్, ఇంటర్నెట్ సేవలను అందించబోతున్నారు. ఈ విధంగా ముఖేష్ అంబానీ ఆఫ్రికాలోని ఘనాకు సహాయం చేయాలని ప్లాన్ చేశారు. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా కాఫీకి ప్రసిద్ధి చెందింది. కానీ ప్రస్తుతం రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖేష్ అంబానీ ఇక్కడ హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు.


చౌకగా 5జీ కనెక్టివిటీ

రిలయన్స్ గ్రూప్ నేతృత్వంలోని నెక్స్ట్ జెన్ ఇన్‌ఫ్రాకో (NGIC) ఆఫ్రికన్ దేశమైన ఘనాలో జియో తరహా ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. NGIC అంతిమ లక్ష్యం డిజిటల్ కనెక్టివిటీని పెంచడం. ఘనా దేశం అంతటా అధిక నాణ్యత గల 5G సేవలను అందుబాటులో ఉంచడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి NGIC ఘనా ప్రభుత్వం, Ascend Digital Solutions, K-Net, Nokia, Radisysతో ఒప్పందాన్ని కలిగి ఉంది. దీంతో ఘనాలో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడమే కాకుండా డేటా ఖర్చు కూడా తగ్గనుంది. ఇది దేశంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి కూడా సహాయపడుతుంది.


వృద్ధి చెందేలా

ఈ ఆఫ్రికన్ దేశం కోసం ప్రధాన అభివృద్ధిలో భాగంగా నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాకో తన మొదటి 5G నెట్‌వర్క్‌ను శుక్రవారం ప్రారంభించనున్నట్లు కమ్యూనికేషన్స్, డిజిటలైజేషన్ మంత్రి ఉర్సులా ఓవుసు ఎకుఫుల్ తెలిపారు. ఇది పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాపారాలు వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తుందని భావించారు. ఈ సేవల ద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ భారతదేశంలో రిలయన్స్ జియో ఎలా విజయాన్ని సాధించిందో ఇక్కడ కూడా ఆ విధంగా ప్లాన్ చేయనున్నారు. ముకేశ్ అంబానీ సెప్టెంబర్ 2016లో రిలయన్స్ జియోను ప్రారంభించారు. నేడు ఇది చందాదారుల సంఖ్య పరంగా దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది.


రుణ సంక్షోభం నుంచి

తక్కువ ధర హై స్పీడ్ ఇంటర్నెట్ సేవల ద్వారా వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రుణ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని ఘనా ప్రయత్నం చేస్తుంది. జూలైలో ప్రెసిడెంట్ నానా అకుఫో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చౌకగా రుణాలు అందించడానికి 8.2 బిలియన్ సెడిస్ ($503 మిలియన్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ విభాగంలోని వ్యాపారాలు స్థూల జాతీయోత్పత్తిలో 70% వాటాను కలిగి ఉన్నాయి. నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాను రాడిసిస్ కార్పొరేషన్ అందిస్తుంది. ఆరేళ్లలోగా ఇంటర్నెట్ వ్యాప్తిని 100%కి పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 02 , 2024 | 09:47 AM