Next Week IPOs: వచ్చే వారం రానున్న స్విగ్గీ, నివా బుపా సహా కీలక ఐపీఓలు
ABN , Publish Date - Nov 03 , 2024 | 11:13 AM
నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఈసారి 5 కొత్త IPOలు రాబోతున్నాయి. వీటిలో స్విగ్గీ, నివా బుపా సహా కీలక ఐపీఓలు ఉన్నాయి. ఆ కంపెనీల ధరలు ఎలా ఉన్నాయి. ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) ఐపీఓల వీక్ మళ్లీ రానే వచ్చింది. ఈసారి రేపటి (నవంబర్ 4) నుంచి నుంచి ప్రారంభమయ్యే వారంలో 5 కొత్త IPOలు రాబోతున్నాయి. వీటిలో 4 మెయిన్‌బోర్డ్ విభాగానికి చెందినవి. ఈ వారంలో ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ, ఆరోగ్య బీమా కంపెనీ నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓలలో డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇది కాకుండా వచ్చే వారంలో ఇంకో కంపెనీ కూడా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇది కూడా మెయిన్‌బోర్డ్ విభాగానికి చెందినది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పందండి.
సగిలిటీ ఇండియా ఐపీఓ: రూ.2,106.60 కోట్ల ఈ ఐపీఓ నవంబర్ 5న ప్రారంభం కానుంది. నవంబర్ 7 వరకు ఇందులో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 28-30గా నిర్ణయించబడింది. లాట్ పరిమాణం 500 షేర్లు. ఇష్యూ ముగిసిన తర్వాత నవంబర్ 12న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో షేర్ల లిస్టింగ్ జరుగుతుంది.
ACME సోలార్ హోల్డింగ్స్ IPO: ఈ ఇష్యూ నవంబర్ 6న ప్రారంభమై, నవంబర్ 8న ముగుస్తుంది. రూ. 2,900 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఒక్కో షేరు ధర రూ. 275-289. లాట్ పరిమాణం 51 షేర్లు. నవంబర్ 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్ల లిస్టింగ్ జరగనుంది.
Swiggy IPO: రూ. 11,327.43 కోట్ల ఈ ఇష్యూ నవంబర్ 6న ప్రారంభమై, నవంబర్ 8న ముగుస్తుంది. నవంబర్ 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్లు లిస్టవుతాయి. బిడ్డింగ్ కోసం ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 371-390. లాట్ పరిమాణం 38 షేర్లు.
నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ IPO: రూ. 2,200 కోట్ల ఈ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 7న సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఈ IPO ముగింపు నవంబర్ 11న జరుగుతుంది. దీని ధరను ఇంకా నిర్ణయించలేదు. నవంబర్ 14న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్ల లిస్టింగ్ జరగవచ్చు.
నీలం లినెన్స్ గార్మెంట్స్ IPO: ఈ ఇష్యూ నవంబర్ 8న తెరవబడుతుంది. నవంబర్ 12న ముగుస్తుంది. ఈ IPO పరిమాణం రూ. 13 కోట్లు. ఒక్కో షేరుకు రూ. 20-24. ఇష్యూ ముగిసిన తర్వాత షేర్లు నవంబర్ 18న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి.
Afcons ఇన్ఫ్రాస్ట్రక్చర్
నవంబర్ 4న ప్రారంభమయ్యే కొత్త వారంలో కేవలం ఒక కంపెనీ మాత్రమే స్టాక్ మార్కెట్లలో జాబితా చేయబడుతుంది. అది ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రూ. 5,430 కోట్ల ఇష్యూ అక్టోబర్ 25న ప్రారంభమై, అక్టోబర్ 29న ముగిసింది. ఇది దాదాపు 3 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది.
ఇవి కూడా చదవండి:
UPI Services: నవంబర్‌లో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్.. కారణమిదే..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read More Business News and Latest Telugu News