Share News

Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!

ABN , Publish Date - May 24 , 2024 | 01:16 PM

ఆర్బీఐ(RBI) నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎం(Paytm) ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 15 - 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని అనుకుంటోందట.

Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!

ఇంటర్నెట్ డెస్క్: ఆర్బీఐ(RBI) నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎం(Paytm) ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 15 - 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని అనుకుంటోందట. 2024 ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని చూస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో పేటీఎంలో 32 వేల 798 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో 29 వేల 503 మంది యాక్టివ్ వర్క్ ఫోర్స్‌గా ఉన్నారు.

ఆ సమయంలో ఒక్కో ఉద్యోగి మీద పేటీఎం సరాసరిన 7 లక్షల 87 వేల రూపాయలు ఖర్చు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల కోసం పెట్టాల్సిన ఖర్చు 34 శాతం పెరగాలి. అంటే ఒక్కో ఉద్యోగి మీద పేటీఎం 10 లక్షల 60 వేలు కంపెనీ ఖర్చు చేయాలన్నమాట. తద్వారా ఏటా కంపెనీకి రూ.3 వేల 124 కోట్లు ఖర్చు అవుతుంది.


రూ.500 కోట్ల ఆదా కోసం..

నష్టాలను తగ్గించడానికి ఉద్యోగులపై వేటు వేయడమే మార్గమని పేటీఎం భావిస్తోంది. ఉద్యోగులను తొలగించడం ద్వారా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయం సేవ్ చేయాలని కంపెనీ ప్రణాళికలు రచించింది. కంపెనీలో 15 - 30 శాతం వర్క్ ఫోర్స్ అంటే దాదాపు 5 వేల నుంచి 6 వేల 300 మంది ఉద్యోగులపై వేటు పడబోతోందనమాట. గతేడాది డిసెంబర్‌లోనే ఉద్యోగుల తొలగింపుపై పేటీఎం హింట్ ఇచ్చింది.

ఆ సమయంలో వెయ్యి మందిని వేరే విభాగాలకు పంపించింది. FY24కి సంబంధించి ఉద్యోగుల సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ Paytm వారికి అయ్యే వ్యయ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతతో కంపెనీని ముందుకు నడిపి.. గణనీయంగా లాభాలు పొందాలని చూస్తోంది. ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం రూ2 వేల 267 కోట్లు(3 శాతం) నష్టపోయింది.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 01:16 PM