Share News

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ@ ఆల్ టైమ్ హై.. ఒక్క రోజులో రూ.6 లక్షల కోట్లు లాభం..

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:10 PM

అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంతో దేశీయ సూచీలు బుల్ జోరు చూపిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు భారత మార్కెట్లకు మేలు చేస్తుందనే అంచనాలు వెలువడతుండడంతో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలు అందుకుని జీవన కాల గరిష్టాలకు చేరుకున్నాయి.

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ@ ఆల్ టైమ్ హై.. ఒక్క రోజులో రూ.6 లక్షల కోట్లు లాభం..
Stock Market

అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంతో దేశీయ సూచీలు బుల్ జోరు చూపిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు భారత మార్కెట్లకు మేలు చేస్తుందనే అంచనాలు వెలువడతుండడంతో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలు అందుకుని జీవన కాల గరిష్టాలకు చేరుకున్నాయి. సెనెక్స్ 84, 500 పాయింట్ల పైన క్లోజ్ అయింది. నిఫ్టీ 25, 750పై స్థిరపడింది. రెండు ప్రధాన సూచీలు ఆల్ టైమ్‌ హైకి చేరుకున్నాయి. బ్యాంక్ ఇండెక్స్, మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల విలువ ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.472 లక్షల కోట్లకు చేరింది. (Business News).


గురువారం ముగింపు (83, 184)తో పోల్చుకుంటే దాదాపు 500 పాయింట్ల లాభంతో 83, 603 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 1500 పాయింట్లకు పైగా లాభపడి 84, 694 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. శుక్రవారం సెన్సెక్స్ 83, 187-84, 694 శ్రేణి మధ్య కదలాడింది. చివరకు సెన్సెక్స్ 1359 పాయింట్ల లాభంతో 84, 544 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఒక దశలో 25, 849 వద్ద జీవన కాల గరిష్టాన్ని చేరుకుంది. చివరకు 375 పాయింట్ల భారీ లాభంతో 25, 790 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఎస్కార్ట్స్ క్యాబటా, ఎమ్ అండ్ ఎమ్, బోష్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలు సంపాదించాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ హౌస్, ముత్తూట్ ఫైనాన్స్, గ్రాసిమ్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 856 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 755 పాయింట్లు లాభపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.56గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Gold Price Hike: బంగారం ప్రియులకు భారీ షాక్.. ఆల్ టైం హైకి ధరలు


Stock Market: వారాంతంలో కూడా స్టాక్ మార్కెట్ జోరు.. ఇవే టాప్ 5 స్టాక్స్


Updated Date - Sep 20 , 2024 | 04:10 PM