Swiggy IPO: స్విగ్గీ మార్కెట్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఐపీఓ వివరాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:27 PM
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు సిద్ధమవుతోంది. ఇప్పటికే జొమాటో స్టాక్ పరుగులు పెడుతున్న నేపథ్యంలో స్విగ్గీ కూడా మార్కెట్ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇప్పటికే స్విగ్గీ ఐపీఓకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు సిద్ధమవుతోంది. ఇప్పటికే జొమాటో (Zomato) స్టాక్ పరుగులు పెడుతున్న నేపథ్యంలో స్విగ్గీ కూడా మార్కెట్ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇప్పటికే స్విగ్గీ ఐపీఓకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో స్విగ్గీ ఐపీఓ (Swiggy IPO) కోసం కోసం చాలా మంది మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ గుడ్ న్యూస్ చెబుతూ మరికొద్ది రోజుల్లో స్విగ్గీ ఐపీఓ ప్రారంభం కాబోతోందనే వార్తలు మొదలయ్యాయి. (Business News).
స్విగ్గీ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అంతకు ఒక రోజు ముందే అంటే నవంబర్ 5న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీఓ ప్రారంభం కాబోతోంది. మిగతా వారి కోసం నవంబర్ 6వ తేదీన మొదలై 8వ తేదీన ముగియబోతోంది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.10 వేల కోట్లు సమీకరించాలని స్విగ్గీ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.3750 కోట్లు, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లు సమీకరించనున్నారు. ఇక, ఇక మిగిలిన మొత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించే 18.2 కోట్ల షేర్ల నుంచి సమీకరించనున్నారు.
స్విగ్గీ ఐపీఓ ధరల శ్రేణి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీనీ 2014లో స్థాపించారు. 2022లో స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్ల కంపెనీగా లెక్క కట్టారు. తాజా ఐపీఓ ద్వారా 15 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించాలని స్విగ్గీ భావిస్తోంది. కాగా, ఇదే రంగానికి చెందిన జొమాటో 2021లో చాలా బలంగా మార్కెట్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత షేర్ ధర పతనమైనప్పటికీ ఆ తర్వాత భారీగా కోలుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..