ప్రారంభ ధర రూ.10.99 లక్షలు
ABN , Publish Date - Jan 18 , 2024 | 05:23 AM
టాటా మోటార్స్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వెర్షన్ ‘పంచ్.ఈవీ’ విడుదల చేసింది. రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో అందుబాటులో ఉండనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు, రూ.14.49 లక్షలుగా ఉన్నాయి...

మార్కెట్లోకి టాటా ‘పంచ్.ఈవీ’
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వెర్షన్ ‘పంచ్.ఈవీ’ విడుదల చేసింది. రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో అందుబాటులో ఉండనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు, రూ.14.49 లక్షలుగా ఉన్నాయి. ప్యూర్ ఈవీ ఆర్కిటెక్చర్ ‘యాక్టి.ఈవీ’ పై కంపెనీ తీసుకువచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. 25 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన పంచ్.ఈవీ కారు ఒకసారి చార్జింగ్‌తో 315 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. 35 కిలోవాట్ బ్యాటరీతో కూడిన కారు సింగిల్ చార్జింగ్‌తో 421 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందన్నారు. కాగా ఏడాది ద్వితీయార్థంలో కర్వ్, హారియర్ ఈవీ, సియెర్రా, ఆలో్ట్రజ్ ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చంద్ర తెలిపారు.