Share News

Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

ABN , Publish Date - Oct 28 , 2024 | 08:35 AM

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ద్రవ్యోల్బణం, రూపాయితో డాలర్ మారకం విలువ ఆధారంగా బంగారం ధరలో మార్పు జరుగుతుంటుంది. హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73, 590గా ఉంది.

Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Gold Rates

హైదరాబాద్: దేశవ్యాప్తంగా దీపావళి పండగ శోభ వచ్చేసింది. దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీ దేవిని ఆడ పడుచులు పూజిస్తారు. తమకు సిరి, సంపదలు కలుగజేయాలని కోరతారు. పండగ సమయంలో బంగారం (Gold), వెండి కొనడం కామన్. పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పదండి.


Gold.jpg


సిటీలో ఇలా

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ద్రవ్యోల్బణం, రూపాయితో డాలర్ మారకం విలువ ఆధారంగా బంగారం ధరలో మార్పు జరుగుతుంటుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73, 590గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదేవిధంగా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.80,280గా ఉంది. విజయవాడ విశాఖపట్టణంలో కూడా ఇదేవిధంగా ఉంది.


Gold.jpg


ముంబైలో ఇలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,590గా ఉంది. కోల్ కతాలో రూ.73,590గా ఉంది. ఢిల్లీలో రూ.73,740గా ఉంది. చెన్నైలో రూ.73,590గా ఉంది. ముంబై, కోల్ కతా, చెన్నైలో మేలిమి బంగారం ధర రూ.80,280గా ఉంది. ఢిల్లీలో కాస్త ఎక్కువగా ఉంది. రూ.80,430గా ఉంది.


Gold.jpg


పైపైకి వెండి ధర

వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,06,900గా ఉంది. చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో ఇలానే ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పుణేలో కిలో వెండి ధర రూ.97,900గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 96 వేల 900గా ఉంది.

silver2.jpegF.jpg


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Oct 28 , 2024 | 11:00 AM