Share News

Goa: ఇటలీ రాయబారి భార్యకు గాయాలు.. ఆ రిసార్ట్ యజమానిపై కేసు

ABN , Publish Date - Feb 03 , 2024 | 08:58 PM

బాణసంచా కాల్చడం వల్ల ఇటలీ రాయబారి భార్య తలకు గాయాలయ్యాయి. దీంతో గోవా పోలీసులు రిసార్ట్ యజమానిపై కేసు నమోదు చేశారు. అయితే అసలేమైందో ఇప్పుడు చుద్దాం.

Goa: ఇటలీ రాయబారి భార్యకు గాయాలు.. ఆ రిసార్ట్ యజమానిపై కేసు

గోవాలో న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాపాసుల మోతలు, డీజే సౌండ్స్‌తో అనేక ప్రాంతాలు హోరెత్తిపోతాయి. అయితే ఈ క్రమంలోనే ఉత్తర గోవాలోని అశ్వెం బీచ్‌లో జనవరి 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో గోవా బీచ్ రిసార్ట్‌లో బాణాసంచా కాల్చడం వల్ల అక్కడకు వచ్చిన ఇటలీ రాయబారి భార్య తలకు గాయాలయ్యాయి.


దీంతో గోవాలోని ఇటలీ డిప్యూటీ కాన్సుల్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు రిసార్ట్‌ యజమానిపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 338 కింద కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. అయితే రిసార్ట్ ఆవరణలో బాణాసంచా కాల్చడానికి అనుమతి ఇచ్చిన క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ క్రమంలో తాము తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. భారతదేశం, నేపాల్‌లోని ఇటలీ రాయబారి విన్సెంజో డి లూకా భార్య పావోలా ఫెర్రీకి బాణాసంచా తాకడంతో తలకు గాయమైంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Virat Kohli: కోహ్లీ, అనుష్క శర్మలకు రెండో చైల్డ్.. డెవిలియర్స్ కీలక ప్రకటన

Updated Date - Feb 03 , 2024 | 08:58 PM