Share News

Diksuchi: సంస్కృత విశ్వవిద్యాలయంలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్

ABN , Publish Date - Jul 21 , 2024 | 03:41 AM

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(ఎన్‌ఎ్‌సకేటీయూ-సెంట్రల్‌ యూనివర్సిటీ)- పీజీ ఫుల్‌ టైమ్‌/రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Diksuchi:  సంస్కృత విశ్వవిద్యాలయంలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(ఎన్‌ఎ్‌సకేటీయూ-సెంట్రల్‌ యూనివర్సిటీ)- పీజీ ఫుల్‌ టైమ్‌/రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆచార్య, ఎంఏ(శబ్దబోధ/హిందీ), ఎమ్మెస్సీ(కంప్యూటర్స్‌/యోగ థెరపీ), ఎంఏఐఎంటీ ప్రోగ్రామ్‌లలో సీట్లు ఉన్నాయి. సీయూఈటీ అర్హత పొందినవారు, నాన్‌ సీయూఈటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ప్రోగ్రామ్‌లు-విభాగాలు-సీట్లు

ఆచార్య ప్రోగ్రామ్‌లో సాహిత్య(కావ్య వర్గ) 9, సాహిత్య(అలంకార వర్గ) 33, ఐకేఎస్‌ 19, పురాణేతిహాస 24, సామవేద భాష్యం 26, కృష్ణ యజుర్వేద భాష్యం 21, అథర్వ వేద భాష్యం 28, వ్యాకరణం 28, ఫలిత జ్యోతిషం 30, సిద్ధాంత జ్యోతిషం 28, వాస్తు 29, ధర్మశాస్త్రం 28, న్యాయం 27, సంఖ్యా యోగ 28, మీమాంస 27, అద్వైత వేదాంతం 30, విశిష్టాద్వైత వేదాంతం 26, ద్వైత వేదాంతం 6, ఆగమం 11 సీట్లు ఉన్నాయి

  1. ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లో యోగ థెరపీ 11, కంప్యూటర్‌ సైన్స్‌ 20 సీట్లు ఉన్నాయి.

  2. ఎంఏ ప్రోగ్రామ్‌లో శబ్దబోధ 20, హిందీ 9 సీట్లు ఉన్నాయి.

  3. ఎంఏఐఎంటీ ప్రోగ్రామ్‌లో 33 సీట్లు ఉన్నాయి.


  1. అర్హత

  • ఆచార్య ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి మూడేళ్ల డిగ్రీ/శాస్త్రి కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో సెకండ్‌ లాంగ్వేజ్‌గా సంస్కృతం చదివి ఉండాలి

  • ఎంఏ హిందీకి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సెకండ్‌ లాంగ్వేజ్‌గా/ఒక సబ్జెక్ట్‌గా హిందీ చదివి ఉండాలి. లేదంటే హైదరాబాద్‌లోని హిందీ ప్రచారసభ నుంచి విద్వాన్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

  • ఎంఏ శబ్దబోధ ప్రోగ్రామ్‌నకు సమ్మానిత శాస్త్రి కోర్సు ఉత్తీర్ణులు; కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ(న్యాయం/వ్యాకరణం/మీమాంస/దర్శన) పూర్తిచేసినవారు అర్హులు. సంస్కృతం, కంప్యూటర్‌ సైన్స్‌/మేథమెటిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా బీఏ/బీఎస్సీ/బీసీఏ ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

  • ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌నకు కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఒక సబ్జెక్ట్‌గా ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌/డిగ్రీ స్థాయిలో సంస్కృతం ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.

  • ఎమ్మెస్సీ యోగ థెరపీకి ఏదేని డిగ్రీ/సమ్మానిత శాస్త్రి కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

  • ఎంఏఐఎంటీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి గుర్తింపు పొందిన కళాశాల నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.300

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31

సీయూఈటీ అభ్యర్థులకు దరఖాస్తు లింక్‌: https://nsk-tucuet.samarth.edu.in

నాన్‌ సీయూఈటీ అభ్యర్థులకు దరఖాస్తు లింక్‌: https://nsktuadmission.samarth.edu.in

వెబ్‌సైట్‌: WWW.nsktu.ac.in

Updated Date - Jul 21 , 2024 | 03:41 AM