AP Elections: అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి.. అసలేం జరిగిందంటే..?
ABN , Publish Date - May 27 , 2024 | 03:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు అంతూపంతూ లేకుండా పోతోంది. తవ్వేకొద్దే వారి అఘాయిత్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పిన్నెల్లి, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూటమి నేతలపై దాడులు చేయడం, దీన్ని సమర్థవంతంగా తెదేపా శ్రేణులు తిప్పికొట్టిన సంగతీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి.
నెల్లూరు మే 27: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు అంతూపంతూ లేకుండా పోతోంది. తవ్వేకొద్దే వారి అఘాయిత్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పిన్నెల్లి, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూటమి నేతలపై దాడులు చేయడం, దీన్ని సమర్థవంతంగా తెదేపా శ్రేణులు తిప్పికొట్టిన సంగతీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి.
అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి అనుచరులు..
తాజాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి అరాచకాలు బయటకు వచ్చాయి. వైసీపీ శ్రేణులు ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఓటర్లకి పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. ఈ తతంగమంతా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరుల పర్యవేక్షణలో కొనసాగింది.
వరిగొండలో నగదు పంపిణీ చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వీడియోలు వైరల్ కావడంతో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన ఏడుగురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది.
దీంతో మంత్రి కాకాణి ఎన్నికల అధికారులపై మాటల దాడికి దిగారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించలేదంటూ వారిపైనే ఆరోపణలు చేశారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా తమ పార్టీ నేతలను వెనకేసుకు రావడంతో నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వైసీపీ నేతలు చేసిన ఘోరాలు ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి: