Kerala Tourism: పర్యాటక రంగం కోసం కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:47 PM
Kerala Tourism: కేరళ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి రాష్ట్రంలోని సుందర దృశ్యాలను నిక్షిప్తం చేస్తూ.. కేరళ పర్యాటక శాఖ ఓ వీడియో థీమ్ సాంగ్‌ను రూపొందించింది. ఈ వీడియోను కేరళ పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ విడుదల చేశారు. యువ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సమక్షంలో విడుదల చేసిన ఈ వీడియో ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది.

తిరువనంతపురం, మార్చి 25: దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రకృతి అందాలకు నెలవు కేరళ. ఆ రాష్ట్రంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ రాష్ట్రానికి పోటెత్తుతారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ప్రతి ఏటా ఈ రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వస్తోంది. అలాంటి వేళ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృషి సారించిది. అందులోభాగంగా ప్రత్యేక థీమ్ సాంగ్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పి.ఎ. మొహమ్మద్ రియాస్ మంగళవారం తిరువనంతపురంలో విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరువనంతపురంలో మలేషియా ఎయిర్‌లైన్స్ సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ చైనా, జపాన్, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియాతోపాటు న్యూజిలాండ్‌తో సహా ఎనిమిది దేశాలకు చెందని సుమారు 40 మంది టూర్ ఆపరేటర్లతోపాటు 15 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఆతిథ్యం ఇస్తున్నట్లు మంత్రి రియాస్ ప్రకటించారు. అలాగే ఆగస్ట్‌లో కొచ్చిలో MICE (సమావేశాలు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) పర్యాటకంపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కేరళ పర్యాటకానికి సంబంధించిన వారసత్వం, కళలు, సంస్కృతితోపాటు అటు ఉత్తరం నుండి ఇటు దక్షిణం వరకు వ్యాపించిన సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఈ వీడియోలో నిక్షిప్తం చేశారు. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ గీతాన్ని మనోజ్ కురూర్ రచించగా.. శ్రీవల్సన్ జె మీనన్ ఆలపించారు. ఈ థీమ్ వీడియోను యువ ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి రియాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Indigo Flight: ఇండిగోలో ప్రయాణికుడి హల్‌చల్..అప్రమత్తమైన సిబ్బంది
Supreme Court: ఎమ్మెల్యేలు ఫిరాయింపులు..చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
IPL Strategic Time-Out: ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వెనుక ఇంత రహస్యం దాగి ఉందా
Supreme Court: ఎమ్మెల్యేలు ఫిరాయింపులు..చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
Train Cancellation.. Reservation Ticket Refund: ప్రయాణించాల్సిన రైలు రద్దు అయింది.. టికెట్ రిఫండ్ పొందడం ఎలాగంటే..
Summer: వేసవిలో శరీరాన్ని కూల్ కూల్‌గా ఉంచాలంటే..
MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..
For National News And Telugu News