Share News

భార్యను చంపడానికి కానిస్టేబుల్ మాస్టర్ ప్లాన్.. పాములను రంగంలోకి దింపి..

ABN , Publish Date - Mar 25 , 2025 | 09:48 PM

కట్టుకున్న భార్యను చంపాలని ఆ కానిస్టేబుల్ అనుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. భార్యను చంపడానికి పాముల్ని రంగంలోకి దింపాడు. పాములతో భార్యను కరిపించాడు. ఆమె కుప్పకూలిపోయింది.

భార్యను చంపడానికి కానిస్టేబుల్ మాస్టర్ ప్లాన్.. పాములను రంగంలోకి దింపి..
Uttar Pradesh

ఓ కానిస్టేబుల్ భార్యను చంపడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. తన పోలీస్ బుర్రను ఉపయోగించి ఆ ప్లాన్ అమలు పరిచాడు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డైడ్ అన్నట్లు.. అతడి బ్యాడ్ లక్.. భార్య గుడ్ లక్.. పాములు కరిచినా ఆమె బతికింది. అతడి కన్నింగ్ ప్లాన్ ఫెయిల్ అయి.. అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన అనుజ్ పాల్, అన్షిక నాలుగేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. తర్వాత కొన్నేళ్ళ పాటు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అతడామెను శారీరకంగా కూడా వాడుకున్నాడు. లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండటానికి గుడికి తీసుకెళ్లి తాళి కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్షికను తన సోదరి ఇంట్లో పెట్టాడు.


ఆ సమయంలో అతడు కానిస్టేబుల్ జాబ్‌లో లేడు. అయితే, కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత అతడిలో మార్పు వచ్చింది. ఆమెను దూరం పెట్టడం మొదలెట్టాడు. అనుజ్ దూరం పెట్టడంతో ఆమె తట్టుకోలేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమస్య స్టేషన్ వరకు వెళ్లడంతో కాంప్రమైజ్‌కు వచ్చాడు. భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాతి నుంచి అసలు స్టోరీ మొదలైంది. అనుజ్ ప్రతీ రోజూ అన్షికకు నరకం చూపించేవాడు. బూతులు తిట్టేవాడు. బాగా కొట్టేవాడు. అయినా ఆమె అతడ్ని వదిలి వెళ్లలేదు. దీంతో అనుజ్ ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు ఎలాగైనా ఆమెను చంపి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఇందుకోసం ఇద్దరు పాములు పట్టే వాళ్లను రంగంలోకి దించాడు.


అనుజ్ ప్లాన్ ప్రకారం.. ఫిబ్రవరి 19వ తేదీన పాములు పట్టేవాళ్లు తమ పాములతో అనుజ్ ఇంటికి వచ్చారు. అనుజ్.. అన్షికను కదలకుండా పట్టుకున్నాడు. పాములు పట్టే వాళ్లు తమ పాములతో ఆమెపై కాట్లు వేయించారు. అన్షిక గట్టిగా అరుస్తూ .. ఏడుస్తూ కుప్పకూలిపోయింది. కిందపడిపోయిన భార్యను చూసి చనిపోయిందని అనుకున్నాడు. అనుజ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత ఆమె స్ప్రహలోకి వచ్చింది. అక్కడినుంచి పుట్టింటికి పరుగులు తీసింది. వారికి జరిగిన సంగతి చెప్పింది. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు. దీంతో అన్షిక కోలుకున్న తర్వాత డీసీపీ దగ్గరకు వెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు అనుజ్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.


ఇవి కూడా చదవండి:

AP High Court: అలా చేస్తే చూస్తూ ఊరుకోం.. ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్..

మాటల్లో చెప్పలేని ప్రేమ

మరీ ఇంత ఘోరమా.. ప్లాస్టిక్ డబ్బాల్లో మృత శిశువు.. మనుషుల శరీర భాగాలు

Updated Date - Mar 25 , 2025 | 09:48 PM