AP Election: నెల్లూరు రూపురేఖలు మార్చా.. సిటీ అభ్యర్థిగా నారాయణ నామినేషన్
ABN , Publish Date - Apr 22 , 2024 | 03:22 PM
నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీమంత్రి నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నారాయణ నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
నెల్లూరు: నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీమంత్రి నారాయణ (Narayana) నామినేషన్ దాఖలు చేశారు. నారాయణ నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నెల్లూరులో డప్పులు మోగిస్తూ, డ్యాన్స్ చేస్తూ ర్యాలీగా తరలి వచ్చారు. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం వర్థిలాల్లి అని తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. నారాయణ వెంట ఆయన సతీమణి రమాదేవి, కూతుళ్లు డాక్టర్ సింధూ, షరణి తదితరులు ఉన్నారు. ఆ తర్వాత నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో రూ.5260కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఏడాది పొడగునా ప్రతి ఇంటికి మినరల్ వాటర్ తీసుకొచ్చే పథకం ప్రారంభించామని, చివరి దశ పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. మున్సిపల్ స్కూళ్లలో తొలిసారి ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చానని నారాయణ ప్రకటించారు.
ఒంగోలు మాగుంట కుటుంబానికి కంచుకోట
ఇది కూడా చదవండి:
YS Sharmila: వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు గాడిదలు కాశారా? .. షర్మిల ఫైర్
మరిన్ని ఏపీ వార్తల కోసం