Share News

క్షయరహిత సమాజానికి కృషి చేయాలి

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:59 PM

క్షయరహిత సమా జానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ టీవీ బాలమురళీకృష్ణ పిలుపునిచ్చారు.

క్షయరహిత సమాజానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ

  • డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ

  • జిల్లాలో 3,428 కేసుల నమోదు

అరసవల్లి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): క్షయరహిత సమా జానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ టీవీ బాలమురళీకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. క్షయ అంటువ్యాధి అని, ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మైకో బాక్టీరియా ట్యూ బర్‌క్యులోసిస్‌ అనే క్రిమి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని తెలి పారు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ప్రమాదం సంభవిస్తుం దన్నారు. జిల్లాలో గతేడాది 3,854 కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,428 కేసులు నమోదైనట్టు తెలిపారు. సకాలంలో చికిత్స పొందాలని, లేకుంటే మందులకు కూడా లొంగని మొండి వ్యాధిగా మారుతుందని హెచ్చరించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే వైద్యు లను సంప్రదించాలన్నారు. సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుదతుందన్నారు. క్షయవ్యాధిగ్రస్థులకు ఉచితంగా మందులు అందిస్తున్నట్టు తెలిపారు. క్షయవ్యాధి నివారణా దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల కూడ లి వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వ్యాధిగ్రస్థులకు పోషకాహార పంపిణీ, దాతలకు సత్కారం ఉంటుందన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.శ్రీకాంత్‌, డీఐవో డాక్టర్‌ రాందాస్‌, డీపీఎంవో వాన సురేష్‌, డిప్యూటీ డెమో ఎం.వెం కటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:59 PM