Share News

లైంగిక వేధింపులకు కఠినశిక్ష

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:57 PM

మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే 12ఏళ్ల పైబడి శిక్ష పడుతుందని సీని యర్‌ సివిల్‌ న్యాయాధికారి జె.శ్రీనివాసరావు తెలిపారు.

లైంగిక వేధింపులకు కఠినశిక్ష
సోంపేట: మాట్లాడుతున్న న్యాయాధికారి శ్రీనివాసరావు

సోంపేట, మార్చి 22(ఆంధ్రజ్యోతి): మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే 12ఏళ్ల పైబడి శిక్ష పడుతుందని సీని యర్‌ సివిల్‌ న్యాయాధికారి జె.శ్రీనివాసరావు తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. మైనర్లపై లైగింకదాడులు పాల్పడితే ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ సెక్సువల్‌ యాక్ట్‌ 2012 ప్రకారం 12 ఏళ్లపైబడి శిక్ష లేదా ఒక్కోసారి ఉరిశిక్ష కూడా పడుతుంద న్నారు. సమావేశంలో ఎంపీడీవో బి.శ్యామలమ్మ, న్యాయవాది జీఎస్‌ శైలీంద్ర, వెలుగు, మహిళా కార్యదర్శులు పాల్గొన్నారు.

చట్టానికి అందరూ సమానులే

పొందూరు, మార్చి 22(ఆంద్రజ్యోతి): చట్టం ముందు ధనిక, పేద తేడాలేకుండా అం దరూ సమానులేనని జూనియ ర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి బి.జ్యోత్స్న అన్నారు. మలకాం గ్రామంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రామస్థులతో మాట్లా డారు. కేసుల కోసం న్యాయవాదులను నియమించుకోలేని పేదలకోసం న్యాయసేవాధికార సంస్థ ద్వారా సేవలు అందిస్తామన్నారు. ప్రతీఒక్కరికీ చట్టాలు, న్యాయవ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కె.శ్రీనివాసరావు, న్యాయవాదులు కె.మంజుల, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

సరుబుజ్జిలి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపులు పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని ఆమదాలవలస కోర్టు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎస్‌.మణి తెలిపారు. వెన్నెలవలస వద్ద ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికారి ఆదేశాలు మేరకు బాలికలకు నిత్య జీవితంలో ఎదురవుతున్న లైంగిక వేధింపుల అంశంపై శనివారం అవగాహన కల్పించారు. లైంగిక వేధింపులు జరుగుతున్న వివరాలను అధికారులకు ధైర్యంగా తెలియజేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం బిడ్డిక ఉమ, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:57 PM