Back Pain: వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 7 టిప్స్ తో చెక్ పెట్టండి..!
ABN , Publish Date - Jun 27 , 2024 | 03:46 PM
ఒకప్పుడు వయసు పెరిగే కొద్ది శరీరం వంగిపోవడం వల్ల వెన్ను నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు వచ్చేవి. కానీ నేటి కాలంలో మాత్రం అన్ని వయసుల వారు వెన్ను నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య వల్ల చురుగ్గా లేకపోవడం, రోజువారీ పనులలో అంతరాయం ఏర్పడటం జరుగుతుంది. అయితే..
ఒకప్పుడు వయసు పెరిగే కొద్ది శరీరం వంగిపోవడం వల్ల వెన్ను నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు వచ్చేవి. కానీ నేటి కాలంలో మాత్రం అన్ని వయసుల వారు వెన్ను నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య వల్ల చురుగ్గా లేకపోవడం, రోజువారీ పనులలో అంతరాయం ఏర్పడటం జరుగుతుంది. అయితే వెన్ను నొప్పి సమస్యకు చెక్ పెట్టానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
శరీరం చురుగ్గా ఉండటం వల్ల శరీరం శక్తివంతంగా ఉండటమే కాకుండా కండరాలు కూడా బలపడతాయి. వాకింగ్, రన్నింగ్, ట్రెడ్ మిల్, జుంబా వంటి తక్కువ ఇంపాక్ట్ వ్యాయామాలు చేస్తుంటే శరీరం చురుగ్గా ఉంటుంది.
ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!
నిలబడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చొన్నప్పుడు లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు శరీర పొజిషన్ గమనించుకోవడం ముఖ్యం. బాడీ పొజిషన్ సరిగ్గా లేకపోతే వెన్నునొప్పి వస్తుంది. వీలైనంత వరకు వెన్ను నిటారుగా ఉంచడానికి ప్రయత్నించాలి.
వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుంటే హీట్ అండ్ కోల్డ్ థెరపీలు బాగా సహాయపడతాయి. హీట్ థెరపీ కండరాల ఒత్తిడి విడుదల చేయడానికి, కోల్డ్ థెరపీ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
వెన్నును నిటారుగా ఉంచి ధ్యానం చెయ్యడం, శ్వాస మీద దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాలిక నడుము నొప్పి, వెన్ను నుండి ఉపశమనం లభిస్తుంది.
పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!
వెన్ను నొప్పి లేదా నడుము నొప్పి ఇంకా ఎక్కువ కాకముందే ఫిజియోథెరపిస్ట్ ను సంప్రదించడం మంచిది. ఫిజియోథెరపి వెన్నునొప్పి నివారణకు చక్కగా సహాయపడుతుంది.
కోబ్రా పోజ్, అర్ద చక్రాసనం, నౌకాసనం వంటి యోగాసనాలు వల్ల వెన్ను నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిని నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయాలి.
ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!
మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.