Powernaps: రోజూ మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే కలిగే ప్రయోజనాలు ఇవే!
ABN , Publish Date - Nov 09 , 2024 | 08:54 PM
రోజూ మధ్యాహ్నం పూట కాసేపు చిన్న కునుకు తీస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజంతా పనిలో తీరిక లేకుండా గడిపే వారు మధ్యాహ్నం నిద్రతో కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కలకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిళ్లు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. ఈ విషయాన్ని ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయి. అయితే, రోజుకు 8 గంటల నిద్ర సరిపోతుందా? అంటే కానేకాదని నిపుణులు చెబుతున్నారు. రోజూ మధ్యాహ్నం పూట కాసేపు చిన్న కునుకు తీస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. రోజంతా పనిలో తీరిక లేకుండా గడిపే వారు మధ్యాహ్నం నిద్రతో కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి పొందుతారని వైద్యులు చెబుతున్నారు (Health).
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
మధ్యాహ్నం నిద్రతో ప్రయోజనాలు
మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ కునుకులతో ఆరోగ్య సమస్యలు చాలా వరకూ దరిచేరవు. బీపీ నియంత్రణలో ఉండి గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం తగ్గుతుంది.
మధ్యాహ్నం కునుకులను వైద్యులు పవర్ నాప్స్ అని పిలుస్తుంటారు. అంటే.. కేవలం 20 నిమిషాల పాటు సాగే నిద్రను ఇలా పిలుస్తారు. ఇంతకుమించి నిద్రపోతే అదనపు ప్రయోజనాలు చేకూరినప్పటికీ రాత్రి నిద్రకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం నిద్రతో సెరెటోనిన్ డోపమైన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది.
Viral: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టే
పవర్ నాప్స్‌తో మెదడు రిఫ్రెష్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మెళకువ వచ్చాక పనులను మరింత సృజనాత్మకంగా చేయగలుగుతారట. అంతేకాకుండా విషయాలను అవగాహన చేసుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయట. విషయాలు సుదీర్ఘకాలం గుర్తుంచుకునే సామర్థ్యం ఇనుమడిస్తుందట.
మధ్యాహ్నం నిద్రతో ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 10 నుంచి 30 నిమిషాలకు మించి మధ్యాహ్నాలు నిద్రపోతే రాత్రి నిద్రకు ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాకుండా, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య పవర్ నాప్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందట. మెదడు ఆరోగ్యం గణనీయంగా మెరుగవుతుందట. ప్రతిరోజూ మధ్యాహ్నం ఇలా చిన్న కునుకు తీసేవారు ఇతరులతో పోలిస్తే మరింత ఆరోగ్యంగా సంతృప్తికరమైన జీవనం సాగిస్తారట.
Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!
Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..