Share News

Health tips: మీరు సిట్టింగ్ వర్క్ చేస్తుంటారా? జాగ్రత్తపడకుంటే ఈ 9 సమస్యలు రావడం పక్కా..!

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:48 AM

సిట్టింగ్ వర్క్.. ఇప్పటి ఉద్యోగాలలో చాలా సాధారణం అయిపోయింది. రోజుకు 8 గంటలు స్రీన్ ముందు కూర్చునేవారు ఉంటారు. కొంతమంది అంతకంటే ఎక్కువసేపే సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేస్తుంటారు. అయితే సిట్టింగ్ వర్క్ వల్ల శారీరక శ్రమ ఏమీ ఉండదు, హాయిగా కూర్చుని వర్క్ చేసుకోవడమే అని చాలామంది గొప్పగా చెబుతుంటారు. కానీ..

Health tips: మీరు సిట్టింగ్ వర్క్ చేస్తుంటారా? జాగ్రత్తపడకుంటే ఈ 9 సమస్యలు రావడం పక్కా..!

సిట్టింగ్ వర్క్.. ఇప్పటి ఉద్యోగాలలో చాలా సాధారణం అయిపోయింది. రోజుకు 8 గంటలు స్రీన్ ముందు కూర్చునేవారు ఉంటారు. కొంతమంది అంతకంటే ఎక్కువసేపే సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేస్తుంటారు. అయితే సిట్టింగ్ వర్క్ వల్ల శారీరక శ్రమ ఏమీ ఉండదు, హాయిగా కూర్చుని వర్క్ చేసుకోవడమే అని చాలామంది గొప్పగా చెబుతుంటారు. కానీ ఇలా సిట్టింగ్ వర్క్ చేసే వారికి 9 ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

శరీరం చురుగ్గా ఉన్నప్పుడు శరీరంలో కండరాలు లిపోప్రోటీన్ లిపేస్ వంటి అణువులను విడుదల చేస్తాయి. దీని కారణంగా శరీరంలో చక్కెర, కొవ్వులు ప్రాసెస్ అవుతూ ఉంటాయి. కానీ ఎక్కువసేపు కూర్చుని ఉండటం వల్ల ఈ లిపోప్రోటీన్ లిపేన్ అణువుల విడుదల ఆగిపోతుంది. శరీరంలో కొవ్వు, చక్కెర పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!


శరీరం చురుగ్గా ఉన్నప్పుడు డోపమైన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది శరీరంలో ఒత్తిడి స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఒకేచోట ఎక్కువగా కూర్చోవడం వల్ల డోపమైన్ హార్మోన్ సరిగా విడుదల కాదు. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు పెంచుతుంది.

ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు మధుమేహం వస్తుంది.

ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో చక్కెరలు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెరుగుతుంది.

ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని ఉంటే రక్తప్రసరణ తక్కువగా ఉంటుంది. కాళ్లలో రక్తం గడ్డకట్టి వెరికోస్ వెయిన్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!


రోజంతా కూర్చోవడం వల్ల కండరాలు నిస్తేజంగా ఉంటాయి. దీనివల్ల శరీర కండరాలు బలహీనపడతాయి. బరువును భరించే సామర్థ్యం తగ్గుతుంది. గాయాల ప్రమాదం కూడా పెరుగుతుంది.

సిట్టింగ్ వర్క్ చేసేవారు స్క్రీన్ ను తదేకంగా చూడటం వల్ల మెడ భాగంలో నరాలు ప్రభావితమవుతాయి. ఇది కాలక్రమంలో స్పాండిలోసిస్ కు దారితీస్తుంది.

శారీరక శ్రమ లేకపోవడం, రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల గుండెపోటుకు ప్రధాన కారణమైన రక్తపోటు సమస్య వస్తుంది.

ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మేలు? దిండు వేసుకుని లేదా దిండు లేకుండానా..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 27 , 2024 | 11:48 AM