Share News

Health News: మైగ్రేన్ తలనొప్పా.. ఈ చిట్కాలు ఫాలో కండి..

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:16 AM

మనుషులను తీవ్రంగా వేధించే వ్యాధుల్లో మైగ్రేన్ ఒకటి. ఇది వచ్చిందంటే చాలు గంటలు, రోజుల తరబడి తలనొప్పితో విలవిల్లాడాల్సిందే. కొంతమందికి ఒకవైపు మాత్రమే వస్తే, మరికొంతమందికి రెండు వైపులా తలనొప్పి వస్తుంది. ఇది వచ్చినప్పుడు వాంతులు, వికారం, అలసట, కాంతిని చూడలేకపోవడం, పెద్ద శబ్దాలు వినలేకపోవడం, బలహీతన, అలసట వంటి పలు రకాల సమస్యలు వస్తాయి.

Health News: మైగ్రేన్ తలనొప్పా.. ఈ చిట్కాలు ఫాలో కండి..

మనుషులను తీవ్రంగా వేధించే వ్యాధుల్లో మైగ్రేన్ ఒకటి. ఇది వచ్చిందంటే చాలు గంటలు, రోజుల తరబడి తలనొప్పితో విలవిల్లాడాల్సిందే. కొంతమందికి ఒకవైపు మాత్రమే వస్తే, మరికొంతమందికి రెండు వైపులా తలనొప్పి వస్తుంది. ఇది వచ్చినప్పుడు వాంతులు, వికారం, అలసట, కాంతిని చూడలేకపోవడం, పెద్ద శబ్దాలు వినలేకపోవడం, బలహీతన, అలసట వంటి పలు రకాల సమస్యలు వస్తాయి.


మైగ్రేన్ ఎందుకు వస్తుంది?

మైగ్రేన్ రావడానికి కారణం మాత్రం మిస్టరీగానే మిగిపోయింది. దీనికి వైద్యులు, శాస్త్రవేత్తల దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. అయితే కొన్ని కారణాలను మాత్రం వారు వివరించగలిగారు. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, నిరాశ, అలెర్జీలు, మద్యం తాగడం, నిద్రమాత్రలు వేసుకోవడం, నాడీ వ్యవస్థ రుగ్మతలు, రక్తనాళాల సమస్యలు, కుటుంబ చరిత్ర, మెదడు రసాయనాల్లో అసాధారణ మార్పులు, తరచూ పెద్దపెద్ద శబ్దాలతో సంగీతం వినడం, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోవడం వంటి సమస్యలతో మైగ్రేన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.


విచిత్రం ఏంటంటే భారతీయుల్లో మరికొన్ని పత్యేకమైన కారణాలతో కూడా ఇది వస్తుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. జుట్టుకు మెహందీ పెట్టడం, చల్లని నీటితో స్నానం చేయడం, ఎండలో ఎక్కువగా తిరగడం, వేడి, తేమతో కూడిన వేసవి వాతావరణం, సైనసైటిస్, పంటి నొప్పి వంటి సమస్యలతో భారతీయులు మైగ్రేన్ బారిన పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు.


చికిత్స..

మైగ్రేన్ వచ్చినప్పుడు మందులు, ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రేలు ఉపశమనం కలిగిస్తాయి. అయితే తేలికపాటి వ్యాయామం చేయడం అనేది మైగ్రేన్ తగ్గించేందుకు ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. యోగా, ఏరోబిక్, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, సైక్లింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. అయితే అతి వ్యాయామాలు మంచిది కాదు.


మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందాలంటే ఇవి పాటించండి..

మైగ్రేన్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమైన పనే అని చెప్పాలి. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అయితే దీని నుంచి ఉపశమనం పొందాలంటే మంచి జీవనశైలి అలవరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, ఎక్కువగా నీరు తాగడం, బాగా నిద్రపోవడం వంటివి చేయాలి. అలాగే ఒత్తిడిని దరిచేరనీయెుద్దు. ఎండలో తిరగడం వల్ల తలనొప్పి వచ్చే ప్రమాదం ఉన్నందున మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది.


అకస్మాత్తుగా మైగ్రేన్ వస్తే కంప్యూటర్, మొబైల్ స్క్రీన్లు, లైట్ల వైపు చూడకుండా ఉండాలి. మిరియాలు, అల్లం, నిమ్మకాయతో చేసిన టీని తాగితే కాస్త ఉపశమనం లభిస్తుంది. నొప్పి వచ్చినప్పుడు కోల్డ్ కంప్రెస్ చేయడం మంచిది. ఎక్కువగా మెడ, తలపై కోల్డ్ కంప్రెస్ చేస్తుండడం వల్ల ఇది తగ్గే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే.. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల కూడా ఉపశమనం పొందొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే కాఫీ, సాధారణ టీలకు దూరంగా ఉండడం మంచిది.

Updated Date - Jul 31 , 2024 | 09:16 AM