Share News

Mosquito's: ఈ 3 రకాల దోమల వల్ల ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి.. అవేంటంటే..!

ABN , Publish Date - Aug 02 , 2024 | 11:30 AM

వర్షాకాలంలో దోమల కారణంగా వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. మూడు రకాల దోమలు ప్రమాదకరమైన వ్యాధులు కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Mosquito's: ఈ 3 రకాల దోమల వల్ల ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి..  అవేంటంటే..!

వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇళ్ళలో దోమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దోమల్లోనూ వివిధ రకాలు ఉన్నాయి. అవి వివిధ రకాల జబ్బులను కలిగిస్తుంటాయి. 1897లో జరిగిన ఒక పరిశోధనలో ఆడ దోమలు వ్యాధులను వ్యాపింపజేస్తాయని తేలింది. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షాకాలంలో దోమల కారణంగా వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. మూడు రకాల దోమలు ప్రమాదకరమైన వ్యాధులు కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆ దోమలు ఏంటో.. అవి కలిగించే ప్రమాదకరమైన వ్యాధులు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

భారీ వర్షాలు, నీటి ఎద్దడి, వరదలు మొదలైనవి దోమలు పెరగడానికి అనువైన వాతావరణాలు. అయితే దోమ జాతులలో మూడు రకాలు ప్రాణాంతకమైన వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అవి.. ఏడిస్ దోమలు, అనాఫిలిస్ దోమలు, క్యూలెక్స్ దోమలు.

ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!


ఏడిస్ దోమలు..

ఏడిస్ దోమలు పగటి పూట బయటకు వస్తాయి. వీటి ప్రభావం భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ దోమలు చికున్ గున్యా, డెంగ్యూ జ్వరాలకు కారణం అవుతాయి. ఇవి మాత్రమే కాకుండా లింఫాటిక్ ఫైలేరియాసిస్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, ఎల్లో ఫీవర్, జికా వైరస్ కూడా ఈ దోమల వల్ల వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు..

ఏడిస్ దోమల కాటు వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు వస్తాయి. ఈ రెండు వ్యాధుల లక్షణాలు సమానంగా ఉంటాయి. విపరీతమైన జ్వరం, కళ్ల కింద నొప్పి, వికారం, వాంతులు, కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిర్లు, చర్మం పై దద్దుర్లు, మెడ వెనుక భాగంలో విపరీతమైన నొప్పి, బలహీనత, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలి తింటే.. వీరికి భలే లాభాలు..!


అనాఫిలిస్ దోమలు..

అనాఫిలిస్ దోమలు రాత్రిపూట బయటకు వస్తాయి. వాటి కాటు మలేరియా, తెంఫాడెనియాసిస్ మొదలైన వ్యాధులకు కారణం అవుతుంది. శోషరస ఫైలేరియాసిస్ కేసులు కూడా ఉంటాయి.

లక్షణాలు..

అనాఫిలిస్ దోమ ఉప-సహారా ఆఫికాలో కనుగొనబడింది. ఇది మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. మలేరియాలో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, చలి, వణుకు వంటి లక్షణాలు ఉంటాయి. ఊపిరితిత్తులలో కఫం పేరుకునేలా చేస్తుంది. కొన్ని సందర్భాలలో కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.

క్యూలెక్స్ దోమలు..

క్యూలెక్స్ దోమల వల్ల వెస్ట్ నైల్ జ్వరం, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి.

రోజూ బెల్లం టీ తాగితే ఏం జరుగుతుందంటే..!

వర్షాకాలంలో ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగితే ఏం జరుగుతుంది?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 02 , 2024 | 12:11 PM