Tea With Sound: టీని సౌండ్ చేస్తూ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:30 PM
Tea With Sound: ఉదయాన్నే టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే టీ తాగుతూ సౌండ్ చేయడం ఆరోగ్యానికి మంచిదా.. లేక ఏమన్నా నష్టమా.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగనిదే పొద్దు గడవదు. ఉదయం, సాయంత్రం పూట టీ తాగడం అనేది భారతీయుల ఇళ్లలో సర్వసాధారణం. అయితే టీని కొందరు నిశబ్దం తాగుతూ ఆస్వాదిస్తే మరికొందరు మాత్రం ఒక విచిత్రమైన సౌండ్ చేస్తూ తాగుతుంటారు. సర్ సర్ అంటూ గట్టిగా శబ్ధం చేస్తూ టీని సేవిస్తూ దాన్నీ ఆస్వాదిస్తుంటారు కొందరు. అయితే ఇలా శబ్ధం చేస్తూ తాగడం వల్ల నష్టమేమన్నా కలుగుతుందా.. టీ ని సౌండ్ లేకుండా తాగితే మంచిదా లేక.. సౌండ్‌తో తాగితే మంచిదా ఇప్పుడు చూద్దాం.
టీని సౌండ్ చేస్తూ తాగితే..
టీ తాగేటప్పుడు సౌండ్ చేస్తే నోటీలోకి గాలి చేరుతుంది. దీని వల్ల గ్యాస్, ఉబ్బసం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వేడి వేడిగా ఉంటే టీ ని గట్టిగా సిప్ చేస్తే నాలుకతో పాటు గొంతు కూడా కాలే ప్రమాదం ఉంది. ఎక్కువ సౌండ్ చేస్తూ టీని తాగడం వల్ల దంతాల మీద తీవ్ర ఒత్తిడి పడి ఎనామెల్ దెబ్బతినే అవకాశం ఉంది.
సాండ్ చేయకుండా తాగితే
టీని సౌండ్ చేయకుండా తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టీని మెల్లిగా తాగడం వల్ల టీలోని రుచిని ఆస్వాదించడంతో పాటు కడుపులో గాలి చేరకుండా చూసుకోవచ్చు. పది మందిలో ఉన్నప్పుడు టీని శబ్దం చేసుకుంటూ తాగితే అది ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జపాన్, చైనా వంటి దేశాల్లో సౌండ్ చేస్తూ టీ తాగడం అనేది సాంప్రదాయం. కానీ ఇండియా మాత్రం ఇలా తాగడం సాంప్రదాయం కాదు.
టీని సౌండ్ చేస్తూ తాగితే చల్లారే అవకాశం ఉంటుందని కొందరు చెబుతుంటారు. కాని ఇది సరైన పద్దతి కాదు. టీ నెమ్మదిగా, సౌండ్ చేయకుండా తాగడమే సరైన పద్దతి. దీంతో టీని శబ్దం చేయకుండా తాగితే ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. టీ రుచిని కూడా ఆస్వాదించే వీలు ఉంటుంది. సో.. మీరు ఒకసారి ట్రై చేయండి మరి.
ఇవి కూడా చదవండి
Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్
Lokesh Speech Highlights: రికార్డులు సృష్టించేది.. బద్దలు కొట్టేది టీడీపీనే
Read Latest Lifestyle News And Telugu News