Period Cramps: పీరియడ్స్ సమయంలో కడుపులో తిమ్మిరికి చెక్ పెట్టే టీలు ఇవి..!
ABN , Publish Date - Jul 09 , 2024 | 08:47 AM
ఒక వయసు పచ్చాక ప్రతి అమ్మాయికి నెలనెలా పీరియడ్స్ రావడం మాములే. అయితే ఆ సమయంలో వచ్చే నొప్పిని, అసౌకర్యాన్ని భరించడం అంత ఈజీ కాదు. నెలసరి సమయంలో కొందరు మహిళలు సాధారణంగానే ఉంటారు. మరికొందరు మాత్రం కడుపు నొప్పి, కడుపులో కండరాల తిమ్మిరి మొదలైనవాటిని అనుభవిస్తుంటారు. ఈ నొప్పిని, తిమ్మిర్లను తగ్గించడానికి..
ఒక వయసు పచ్చాక ప్రతి అమ్మాయికి నెలనెలా పీరియడ్స్ రావడం మాములే. అయితే ఆ సమయంలో వచ్చే నొప్పిని, అసౌకర్యాన్ని భరించడం అంత ఈజీ కాదు. నెలసరి సమయంలో కొందరు మహిళలు సాధారణంగానే ఉంటారు. మరికొందరు మాత్రం కడుపు నొప్పి, కడుపులో కండరాల తిమ్మిరి మొదలైనవాటిని అనుభవిస్తుంటారు. ఈ నొప్పిని, తిమ్మిర్లను తగ్గించడానికి ప్రత్యేక మందులు ఏవీ లేకపోయినా వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు చక్కని ఉపశమనాన్ని ఇస్తాయి. వంటింట్లో ఉండే మసాలా దినుసులతో టీలు చేసుకుని తాగితే నెలసరి తిమ్మిర్లు తగ్గుతాయి. ఆ టీలు ఏెంటో తెలుసుకుంటే..
Migraine Vs Sleeping: మైగ్రేన్ ఉన్నవారికి ప్రశాంతమైన నిద్ర రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
సోపు..
నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికి సోపు గింజలను తీసుకోవచ్చు. సోపు విత్తనాలు పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో, రక్త ప్రవాహాన్ని తేలిక చేయడంలో సహాయపడతాయి. సోపు గింజలను నీటిలో మరిగించి వడగట్టి తాగవచ్చు. లేదంటే సోపు గింజలు అలాగే తినవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఇతర కడుపు సంబంధ సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే ఉబ్బరాన్ని తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
అల్లం..
అల్లంలో ఉండే ఔషద గుణాలు కడుపు సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పీరియడ్స్ క్రాంప్స్ తగ్గించుకోవడానికి అల్లం మెత్తగా దంచి లేదా చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి ఆ నీటిని వడపోసి తాగాలి. అల్లం రసాన్ని నీటిలో కలిపి కూడా తాగవచ్చు.
ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!
వేడి కాపడం..
పీరియడ్స్ సమయంలో కడుపు చుట్టూ, పొట్ట కింది భాగంలో నొప్పి వస్తుంది. కడుపు కండరాలు బిగుతుగా పట్టేసినట్టు ఉంటాయి. ఈ నొప్పిని తగ్గించడానికి, వేడినీటితో హీటింగ్ ప్యాచ్ లేదా బాటిల్‌ను నింపాలి. దీని మీద ఒక గుడ్డ చుట్టి పొట్ట చుట్టూ, పొట్ట మీద ఉంచుకోవచ్చు. లేదంటే వేడి నీటి కాపడం కూడా పెట్టవచ్చు. దీని వల్ల నొప్పి తగ్గడం గమనించవచ్చు.
ఆహారం..
ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంటే పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే వాటిని చేర్చండి. మెగ్నీషియం పీరియడ్స్ క్రాంప్‌లను తగ్గిస్తుంది. చమోమిలే, పిప్పరమెంటు టీ కూడా తాగవచ్చు. ఇవి కూడా పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
వర్షాకాలంలో కండ్లకలక రాకూడదంటే.. ఇలా చేయండి..!
ఈ మసాలా దినుసులు తింటే చాలు.. పొట్ట కొవ్వు తగ్గిపోతుందట..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.