Share News

Health: వాకింగ్, జాగింగ్, సైక్లింగ్.. వీటిల్లో ఎవరు దేన్ని ఎంచుకోవాలంటే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:22 PM

వాకింగ్, జాగింగ్, సైక్లింగ్.. ఈ మూడింటి ప్రత్యేకతలు ఎవరు దేన్ని ఎంచుకోవాలో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.

Health: వాకింగ్, జాగింగ్, సైక్లింగ్.. వీటిల్లో ఎవరు దేన్ని ఎంచుకోవాలంటే..

ఇంటర్నెట్ డెస్క్: తమ ఫిట్‌నెస్ లెవెల్స్ కాపాడుకోదలిచిన వారికి ముందుగా గుర్తొచ్చేవి వాకింగ్, జాగింగ్, సైక్లింగ్. వీటికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జనాలు తమ జీవనశైలి, ఆరోగ్య సమస్యలు, లక్ష్యాలు అనుసరించి ఈ మూడింటిల్లో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. వీటిల్లో ఎవరెవరు ఏది ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

నడక: కసరత్తులు అసలేమాత్రం అలవాటు లేని వారు మొదటగా చేయాల్సింది వాకింగే. ఇది అత్యంత సులభమైన కసరత్తు. అన్ని వయసుల వారు నడకతో లాభం పొందొచ్చు. దీంతో, శరీరంపై ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉంటాయి. నడకతో రక్తప్రసరణ మెరుగై గుండె ఆరోగ్యం ఇనుమడిస్తుంది. నడక వేగం, దూరాన్ని బట్టి కెలొరీలు ఖర్చువుతాయి. ఆందోళన, ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. రోజు వారి కార్యక్రమాల్లో భాగంగా కూడా వాకింగ్ చేయొచ్చు.

High Cholesterol: అధిక కొలెస్టెరాల్! ముఖం, కళ్లల్లో ఈ మార్పులు కనిపిస్తే డేంజరే!


అయితే, జాగింగ్, సైక్లింగ్‌తో పోలిస్తే నడకతో కెలొరీల వినయోగం తక్కువగా ఉంటుంది. కండరాల శక్తి, శరీర సామర్థ్యం పెంచేందుకు అంతగా ఉపకరించదు. కసరత్తులు అలవాటు లేని వారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఇది అత్యంత అనువైనది. శరీరంలో ఎక్కవ ఒత్తిడి లేకుండానే యాక్టివ్‌గా ఉండేందుకు తోడ్పడుతుంది

జాగింగ్ ప్రభావశీలత కాస్త మధ్యస్థంగా ఉంటుంది. స్టామినా పెంచుకోవడంతో కెలొరీలను ఖర్చు చేయాలనుకునేవారికి ఇది అత్యంత అనువైనది. జాగింగ్‌తో తక్కువ వ్యవధిలోనే ఆరోగ్యపరమైన లక్ష్యాలు చేరుకోవచ్చు.

అనుకూలతలు.. జాగింగ్‌తో గుండెఆరోగ్యం, స్టామినా పెరుగుతుంది. కెలొరీలు త్వరగా ఖర్చై బరువు సులభంగా అదుపులోకి వస్తుంది. కాళ్లు, కోర్ భాగంలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేసి మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తుంది

Health: దీర్ఘాయుష్షు కోసం ఈ రక్త పరీక్షలు తప్పనిసరి!

జాగింగ్‌తో కీళ్లపై అధిక ప్రభావం పడుతుంది. కాబట్టి ఆర్థరైటిస్, కీళ్ల సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఇది తగినది కాదు. ఓ మోస్తరు ఫిట్‌నెస్ ఉన్న వారికి ఇది అనువైనది. బరువు తగ్గించుకోవాలన్నా, గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలన్నా లేదా మరింత శక్తిమంతమైన కసరత్తులకు సంసిద్ధమయ్యే క్రమంలో ముందుగా జాగింగ్‌ను ఎంచుకోవచ్చు


అన్ని ఫిట్‌నెస్ లెవెల్స్ ఉన్న వాళ్లకూ అనువైనది సైక్లింగ్. దీనితో శరీరంపై ప్రతికూల ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది. కీళ్ల సంబంధిత సమస్యలు ఉన్న వారికీ ఇది అనువైనది. శరీరం దిగువఅర్థ భాగం సైక్లింగ్‌తో బలోపేతమవుతుంది. కెలొరీలు త్వరగా ఖర్చవుతాయి. అయితే, బయటిప్రదేశాల్లో సైక్లింగ్‌తో ప్రమాదాలు జరిగే అవకాశాలూ లేకపోలేదు.

ఇక గంటకు నాలుగు ఐదు కిలోమీటర్ల వేగంతో నడిస్తే గంటకు 250 కెలొరీల మేర ఖర్చు చేసుకోవచ్చు. 8 - 10 కేఎమ్‌పీహెచ్‌ వేగంతో పరిగెడితే గంటకు సుమారు 600 కెలొరీలు ఖర్చవుతాయి. ఇక 20 కేఎమ్‌పీహెచ్ వేగంతో సైకిల్ తొక్కితే 500 కెలొరీలు, ఇంతకు మించిన వేగంతో గంటకు 700 కేలొరీలు వినియోగం అవుతాయి. తక్కవ సమయంలో ఎక్కువ ప్రభావం పొందాలనుకునేవారికి జాగింగ్ సైక్లింగ్ అనువైనవని నిపుణులు చెబుతున్నారు.

Read Latest and Health New

Updated Date - Dec 30 , 2024 | 12:22 PM