ఐఐటీహెచ్ ప్రొఫెసర్లకు ప్రపంచస్థాయి గుర్తింపు
ABN , Publish Date - Sep 22 , 2024 | 03:38 AM
సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరిశోధనలతో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు.
టాప్ శాస్త్రవేత్తల జాబితా ప్రకటించిన స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ.. 23 మందికి చోటు
కంది, సెప్టెంబరు 21: సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరిశోధనలతో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలకు సంబంధించిన జాబితాను అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్ సంస్థలు శనివారం విడుదల చేశాయి. అందులో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు 23 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి ప్రొఫెసర్లను అభినందించారు. అధ్యాపకుల అత్యున్నత పరిశోధనల ప్రతిభ, వారి అంకితభావంతోనే ఇంతటి గౌరవప్రదమైన స్థానం దక్కిందని ఆయన కొనియాడారు. ఐఐటీ హైదరాబాద్ అధ్యాపకులు ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందడం పట్ల ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎ్‌స.మూర్తి హర్షం వ్యక్తం చేశారు.