ఆంజనేయస్వామికి పూజలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:39 AM
రావులపాలెంలోని పెద్ద ఆంజనేయస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం ప్రత్యేక పూజ లు జరిపారు.

రావులపాలెం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రావులపాలెంలోని పెద్ద ఆంజనేయస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం ప్రత్యేక పూజ లు జరిపారు. ఈ సందర్భంగా అంజనీసుత భజనా మండలి అధ్యక్షురాలు రాతికొండ లక్ష్మిసత్యవేణి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి, కృష్ణుని పారాయణలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకూ పారాయణలు చేశా రు. ఏప్రిల్ 15 నుంచి 17వ తేదీ వరకు ఉడిపిలో స్వామివార్ల కీర్తన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మన్యం సూర్యకుమారి, కనకలక్ష్మి, ధనలక్ష్మి, రమాదేవి, అనంతలక్ష్మి, మాలతి తదితరులు పాల్గొన్నారు.