నూకాంబిక ఉత్సవాలపై ఆర్డీవో సమీక్ష
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:37 AM
చింతలూరు నూకాంబిక అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కొత్తపేట ఆర్డీవో పి.శ్రీకర్ అధికారులను ఆదేశిం చారు.

ఆలమూరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): చింతలూరు నూకాంబిక అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కొత్తపేట ఆర్డీవో పి.శ్రీకర్ అధికారులను ఆదేశిం చారు. ఆయా శాఖల సమష్టి కృషితో ఉత్సవాల ను విజయవంతం చేయాలని అన్నారు. మంగళ వారం అమ్మవారి ఉత్సవాలపై ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బం దులు రాకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. క్యూ లైన్‌లో మంచినీటి సదుపాయాలు, చంటి పిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈవో వుండవల్లి వీర్రాజుచౌదరికి సూచించారు. పోలీసు బందోబస్తు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ సర్వీసులపై ఆయా శాఖల అధికారులతో ఆర్డీవో శ్రీకర్ చర్చించారు. సమావేంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, తహశీల్దార్ కేజే ప్రకాష్‌బాబు, ఎంపీడీవో ఎ.రాజు, ఎస్‌ఐ ఎం.అశోక్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉత్సవాలపై ముద్రించిన వాల్‌పోస్టర్‌ను ఆర్డీవోతో పాటు పలువురు అధికారులు ఆవిష్కరించారు.