Share News

బంగ్లాదేశ్‌ సర్కారుకు మరిన్ని అధికారాలు!

ABN , Publish Date - Nov 11 , 2024 | 04:29 AM

బంగ్లాదేశ్‌లో నోబెల్‌ బహుమతి గ్రహీత మొహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరిన్ని అధికారాలను దఖలు పరచుకుంది.

బంగ్లాదేశ్‌ సర్కారుకు మరిన్ని అధికారాలు!

ఢాకా/న్యూఢిల్లీ, నవంబరు 10: బంగ్లాదేశ్‌లో నోబెల్‌ బహుమతి గ్రహీత మొహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరిన్ని అధికారాలను దఖలు పరచుకుంది. ఈ మేరకు మధ్యంతర ప్రభుత్వ ఆర్డినెన్స్‌-2024కు తాత్కాలీన(ప్రొవిజనల్‌) ఆమోదం పొందింది. కొత్త పార్లమెంటు ఏర్పాటై ప్రధానమంత్రి నియామకం జరిగే వరకు తాత్కాలిక ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ తాజా ఆర్డినెన్స్‌ వల్ల చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తాజా చర్య నియంతృత్వమేనని భారతదేశంలోని ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.. కాగా, యూన్‌సతోపాటు ఆయన కేబినెట్‌ సహచరులు మొత్తం 62 మందిపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అవామీ లీగ్‌ పార్టీ నాయకుడు అన్వరుజ్జమాన్‌ చౌదరి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత వీరంతా దేశంలో మారణహోమం సృష్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 04:29 AM