Share News

Israel: ఇజ్రాయెల్‌కు భారత్‌ ఆయుధాలు!

ABN , Publish Date - May 08 , 2024 | 08:53 AM

పాలస్తీనియులపై ఊచకోతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు, స్వదేశీయులపై దమనకాండను అమలు చేస్తున్న మయన్మార్‌లోని సైనిక (జుంటా) ప్రభుత్వానికి భారత్‌ ఆయుధాలను సరఫరా చేస్తోందని న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘వైర్‌’ వెల్లడించింది.

Israel: ఇజ్రాయెల్‌కు భారత్‌ ఆయుధాలు!

న్యూఢిల్లీ, మే 7: పాలస్తీనియులపై ఊచకోతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు, స్వదేశీయులపై దమనకాండను అమలు చేస్తున్న మయన్మార్‌లోని సైనిక (జుంటా) ప్రభుత్వానికి భారత్‌ ఆయుధాలను సరఫరా చేస్తోందని న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘వైర్‌’ వెల్లడించింది. రక్షణశాఖ ఆధ్వర్యంలో పనిచేసే మ్యూనిషన్స్‌ ఇండి యా లిమిటెడ్‌(ఎంఐఎల్‌) ఇజ్రాయెల్‌కు కొన్నాళ్లుగా ఆయుధాలు సరఫరా చేస్తోందని, తాజాగా ఈ ఏడాది జనవరిలోనూ పంపించిందని తెలిపింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

హైదరాబాద్‌లోని అదానీ–ఎల్బిట్‌ అనే ప్రైవేటు జాయింట్‌ వెంచర్‌ కంపెనీ కూడా ఇజ్రాయెల్‌కు డ్రోన్ల వంటి గగనతల ఆయుధ వ్యవస్థలను సరఫరా చేస్తోందని వైర్‌ ఇటీవల తెలియజేసింది.

కాగా, మయన్మార్‌లోని సైనిక సర్కారుకు కూడా భారత్‌ ఆయుధాలను పంపుతోందని ఐరాస గతేడాది మే నెలలో వెలువరించిన ఓ నివేదికలో తెలిపిందని వైర్‌ కథనం పేర్కొంది. జుంటా సర్కారుకు భారత్‌ ఇప్పటి వరకు రూ.422 కోట్ల ఆయుధాలను విక్రయించినట్లు ఐరాస తెలిపింది.

ఇది కూడా చదవండి:

West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి


IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 08:53 AM