Kamala Harris: డొనాల్డ్ ట్రంప్‌ను బీట్ చేసిన కమలా హారిస్.. ఆగస్టు విరాళాలలో
ABN , Publish Date - Sep 06 , 2024 | 06:07 PM
అమెరికాలో ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ఉన్నారు. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన కమలా హారిస్ ట్రంప్‌నకు గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాదు ఇటివల ఆగస్టులో సేకరించిన విరాళాలలో కూడా హారిస్ ట్రంప్ కంటే ముందున్నారు.
అగ్రరాజ్యం అమెరికా(america)లో ఈ ఏడాది నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కమలా హారిస్(Kamala Harris) ఉన్నారు. వీరు అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన కమలా హారిస్ ట్రంప్‌నకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆగస్టులో పెద్ద ఎత్తున విరాళాలను దక్కించుకున్నారు. 361 మిలియన్ డాలర్లకుపైగా సేకరించి డొనాల్డ్ ట్రంప్ కంటె మూడు రెట్లు ఎక్కువ సాధించారు. ఇదే సమయంలో 130 మిలియన్ డాలర్లు సేకరించినట్లు ట్రంప్ బృందం ప్రకటించింది.
మూడు రెట్లు
డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థురాలు సేకరించిన 361 మిలియన్ డాలర్లు అంతకుముందు సంవత్సరం సేకరించిన మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుతం విరాళల సేకరణలో అగ్రస్థానంలో ఉంది. జో బైడెన్ స్థానాన్ని భర్తీ చేసినప్పటి నుంచి దాదాపు ఏడు వారాల్లోనే హారిస్ నిధుల సేకరణలో మంచి పెరుగుదలను సాధించారు. ఈ నేపథ్యంలో తక్కువ కాలంలోనే వైస్ ప్రెసిడెంట్ హారిస్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ ఎన్నికల చివరి దశలోకి ప్రవేశించినప్పుడు సంపాదించిన ప్రతి డాలర్ ఈ ఎన్నికలను నిర్ణయించే ఓటర్లను గెలిపించడానికి ఉపయోగిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జులైలో డెమొక్రాటిక్ పార్టీ సేకరించిన 310 మిలియన్ డాలర్ల కంటే ఆగస్టులో హారిస్ సేకరించిన 361 మిలియన్ డాలర్ల నిధులు చాలా ఎక్కువ కావడం విశేషం.
ట్రంప్ మాత్రం
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 30, 2024న పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. ఈ క్రమంలో తమ ప్రచారాన్ని విజయపథంలో నడిపించడానికి అవసరమైన వనరులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో బైడెన్ ప్రచారం సమయంలో డెమొక్రాటిక్ పార్టీ కంటే.. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నిధుల సేకరణలో ముందంజలో నిలిచింది. 2024 ఏప్రిల్-జూన్ రెండో త్రైమాసికంలో ట్రంప్ నిధుల సేకరణలో బైడెన్ కంటే $331 మిలియన్ల నుంచి $264 మిలియన్లు ముందున్నారు.
ఇవి కూడా చదవండి:
Union Minister: భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు రూ.15వేల కోట్లు..
Kolkata Doctor Case: కోల్‌కతా కేసులో మరో ట్విస్ట్.. సీబీఐ క్లారిటీ ఇచ్చిందా?
Read MoreInternational News and Latest Telugu News