Matthew Miller: కేజ్రీవాల్ అరెస్ట్.. ఆ విమర్శలకు చెక్ పెట్టిన అమెరికా
ABN , Publish Date - Apr 04 , 2024 | 06:44 PM
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై గతంలో అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. భారత్‌లోని ప్రతిపక్ష నేత కేసుకి సంబంధించిన నివేదికల్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ఆశిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు.
లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అరెస్ట్ చేయడంపై గతంలో అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. భారత్‌లోని ప్రతిపక్ష నేత కేసుకి సంబంధించిన నివేదికల్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ఆశిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ (Matthew Miller) వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది కూడా! అదే సమయంలో.. కేజ్రీవాల్ విషయంలో మాట్లాడిన మిల్లర్, పాకిస్తాన్‌లో ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లపై ఎందుకు మౌనంగా ఉన్నారనే విమర్శలూ వచ్చాయి. ఈ విమర్శలపై ఆయన తాజాగా బదులిచ్చారు.
Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు.. 50 ఏళ్లు దాటినా..
మొదటగా మాథ్యూ మిల్లర్ పాకిస్తాన్, భారత్‌లోని పరిణామాలను ఒకటిగా వర్గీకరించడానికి ఒప్పుకోలేదు. ఆ రెండూ వేర్వేరు వ్యవహారాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అలాగే.. పాకిస్తాన్‌లోని ప్రతి ఒక్కరూ స్థిరమైన చట్టం, మానవ హక్కులతో వ్యవహరించేలా చూడాలని అమెరికా కోరుకుంటుందని అన్నారు. ‘‘పాక్‌లోని ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లపై మౌనంగా ఉన్నామనే విషయాన్ని నేను అంగీకరించను. పాకిస్థాన్‌లో ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారమే చూడాలని, వారి మానవహక్కులను గౌరవించాలని మేము చాలా సందర్బాల్లో చెప్పాం. అదే వైఖరిని ప్రపంచంలోని అన్ని దేశాల విషయంలో అనుసరిస్తాం’’ అని మాథ్యూ మిల్లర్ వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ అనుకూలం కాదని, మానవ హక్కుల విషయంలోనే మాట్లాడుతామని చెప్పుకొచ్చారు.
Heatwave: మండిపోతున్న ఎండలు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు
మరోవైపు.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యల మీద భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) మంగళవారం ఘాటుగా స్పందించారు. ఇది పాత చెడు అలవాటు అని, దేశాల మధ్య మర్యాద అనేది ఉండాలని చెప్పారు. మనవి సార్వభౌమత్వం ఉన్న దేశాలని.. ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారని మిల్లర్ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశిస్తూ.. దేశ రాజకీయాలపై కూడా మరొరు వ్యాఖ్యానించకూడదని పేర్కొన్నారు. ఒక్కసారి ఇలాంటి విషయాలపై వాగ్వాదం మొదలైతే దానికి అంతం అనేది ఉండదని, అందుకే వీటిపై తమ అభ్యంతరాల్ని ఆ దేశ దౌత్యవేత్తలకు గట్టిగా చెప్పామని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి