Share News

Attack on Trump: ట్రంప్‌పై హత్యాయత్నంలో ఇరాన్ ప్రమేయం ఉందా?.. బైడెన్ సర్కారు కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 17 , 2024 | 09:53 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంలో కుట్రకోణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఇదొక నాటకం, ట్రంప్‌ను నమ్మబోమంటూ ఇప్పటికే అమెరికాలో సోషల్ మీడియా వేదికగా చర్చ నడిచింది.

Attack on Trump: ట్రంప్‌పై హత్యాయత్నంలో ఇరాన్ ప్రమేయం ఉందా?.. బైడెన్ సర్కారు కీలక ప్రకటన
Attack On Trump

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంలో కుట్రకోణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఇదొక నాటకం, ట్రంప్‌ను నమ్మబోమంటూ ఇప్పటికే అమెరికాలో సోషల్ మీడియా వేదికగా చర్చ నడిచింది. ఉక్రెయిన్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇరాన్‌పైనా ఈ తరహా సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ తరహా కథనాలపై అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం స్పందించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ ఏమైనా కుట్ర చేసిందా అనే కోణంలో ఇంటెలిజెన్సీ సమాచారాన్ని తెప్పించుకున్నామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింద. అయితే హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తితో ఎలాంటి సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు దొరకలేదని వెల్లడించింది.


పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన సమావేశానికి ముందు ఇరాన్ నుంచి ప్రమాదం పొంచివున్నట్టు సీక్రెట్ సర్వీస్, ట్రంప్ ప్రచార బృందాలకు తెలుసునని అమెరికా జాతీయ భద్రతా అధికారులు పేర్కొన్నారు. అయితే ట్రంప్‌పై కాల్పులు జరిపిన థామస్ మాథ్యూ క్రూక్‌ ఒంటరిగానే ఈ పని చేశాడని తెలిపారు.


కాగా పెన్సిల్వేనియా ర్యాలీకి ముందు ట్రంప్ ప్రచార బృందాన్ని యూఎస్ఎస్ఎస్ (US Secret Service) అధికారులు హెచ్చరించారు. బహిరంగ ర్యాలీలతో అధిక ముప్పు పొంచివుందని, ర్యాలీల్లో తమకు మరింత నియంత్రణ కావాలని అధికారులు సమాచారం ఇచ్చారు. దాడి ముప్పు ఉన్నట్టు కొత్తగా సమాచారం వస్తోందంటూ హెచ్చరించినట్టు యూఎస్ఎస్ఎస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లెమీ వెల్లడించారు. కాగా ఇరాన్ నుంచి ముప్పు పొంచివుందనే విషయం తెలుసా అని ప్రశ్నించగా స్పందించేందుకు ట్రంప్ ప్రచార బృందం తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి

ట్రంప్‌పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్‌?

డొనాల్డ్ ట్రంప్ పార్టీ మీటింగ్‌కు సమీపంలో ఏకే-47తో పట్టుబడ్డ వ్యక్తి

For more International News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 09:55 AM