Share News

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

ABN , Publish Date - Oct 26 , 2024 | 02:57 AM

గాజాలో హమాస్--ఇజ్రాయెల్‌ మఽధ్య ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సంధి కుదిర్చే యత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి.

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

  • రేపు ఖతార్‌ ప్రధానితో దోహాలో చర్చలు

  • హాజరుకానున్న సీఐఏ చీఫ్‌, మొసాద్‌ చీఫ్‌

గాజా, టెల్‌ అవీవ్‌, బీరుట్‌ అక్టోబరు 25: గాజాలో హమాస్--ఇజ్రాయెల్‌ మఽధ్య ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సంధి కుదిర్చే యత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ మొస్సాద్‌ చీఫ్‌ డేవిడ్‌ బర్నియా, అమెరికా ఇంటలిజెన్స్‌ సంస్థ సీఐఏ చీఫ్‌ బిల్‌ బర్న్స్‌.. ఖతార్‌ రాజధాని దోహాలో ఆదేశ ప్రధాని అల్‌ థానీతో ఈ నెల 27న చర్చలు జరుపుతారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్‌ ప్రధాని అల్‌ థానీతో సమావేశమయ్యారు. హమా్‌స-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధాన్ని ఆపే విషయంపై ప్రాథమిక చర్చలు జరిపారు. హమాస్‌ చీఫ్‌ యహ్యా సిన్వర్‌ ఇటీవలే ఇజ్రాయెల్‌ దాడిలో మృతి చెందడంతో చర్చల ప్రక్రియ వేగం చేసి యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 60మందికిపైగా చనిపోయారు. మరోవైపు.. లెబనాన్‌లోని హాస్‌బయ్యాలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందారు.

Updated Date - Oct 26 , 2024 | 02:57 AM